ETV Bharat / city

POWER: ఆగస్టులో విద్యుత్‌ గండం.. ! - POWER SHORTAGE

POWER SHORTAGE: రాష్ట్రంలో ఆగస్టు నుంచి విద్యుత్‌ కొరత ఏర్పడే ఆస్కారం ఉందని రియల్‌ టైం సాంకేతికత ఆధారంగా విద్యుత్‌ సంస్థలు అంచనా వేశాయి. ఈ లోటును అధిగమించడానికి విద్యుదుత్పత్తి సంస్థలతో స్వల్పకాలిక ఒప్పందాలను (పీపీఏ) కుదుర్చుకోవాలని డిస్కమ్‌లు నిర్ణయించాయి. పీక్‌ డిమాండ్‌ సమయంలోని టైం బ్లాక్‌లలో (ఒక్కో టైం బ్లాక్‌ 15 నిమిషాలు) సరఫరా చేయడానికి ముందుకొచ్చే సంస్థలకు ప్రాధాన్యమివ్వాలని భావిస్తున్నాయి.

POWER
ఆగస్టులో విద్యుత్‌ గండం
author img

By

Published : Jun 7, 2022, 8:31 AM IST

POWER SHORTAGE: రాష్ట్రంలో ఆగస్టు నుంచి విద్యుత్‌ కొరత ఏర్పడే ఆస్కారం ఉందని రియల్‌ టైం సాంకేతికత ఆధారంగా విద్యుత్‌ సంస్థలు అంచనా వేశాయి. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న వనరుల నుంచి వచ్చే విద్యుత్‌ పోనూ తీవ్ర డిమాండ్‌ సమయంలో (సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటలు) సుమారు వెయ్యి మెగావాట్ల విద్యుత్‌ కొరత ఏర్పడనుందని రాష్ట్ర లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌ (ఎస్‌ఎల్‌డీసీ) నివేదిక ఇచ్చింది. ఈ లోటును అధిగమించడానికి విద్యుదుత్పత్తి సంస్థలతో స్వల్పకాలిక ఒప్పందాలను (పీపీఏ) కుదుర్చుకోవాలని డిస్కమ్‌లు నిర్ణయించాయి. పీక్‌ డిమాండ్‌ సమయంలోని టైం బ్లాక్‌లలో (ఒక్కో టైం బ్లాక్‌ 15 నిమిషాలు) సరఫరా చేయడానికి ముందుకొచ్చే సంస్థలకు ప్రాధాన్యమివ్వాలని భావిస్తున్నాయి. లేదంటే స్వాపింగ్‌ విధానాన్ని (మనకు అవసరమైనప్పుడు తీసుకున్న విద్యుత్‌ను.. అదనంగా ఉన్నప్పుడు ఆయా రాష్ట్రాలకు సర్దుబాటు చేయడం) పరిశీలిస్తున్నాయి. తదనుగుణంగా రాష్ట్ర విద్యుత్‌ సమన్వయ కమిటీకి ప్రతిపాదన పంపనున్నట్లు ఓ అధికారి తెలిపారు. ఖరీఫ్‌ పంటలకు కొన్ని ప్రాంతాల్లో ఆగస్టు నెలాఖరు నుంచి బోర్ల ద్వారా నీరివ్వాల్సి ఉంటుంది. రబీ సీజన్‌లోనూ వ్యవసాయ విద్యుత్‌ వినియోగం పెరుగుతుందని డిస్కంలు అంచనా వేస్తున్నాయి.

కృష్ణపట్నంలో ఒక యూనిట్‌ అందుబాటులోకి..

కృష్ణపట్నం థర్మల్‌ ప్లాంటులో ఒకటో యూనిట్‌ను సోమవారం నుంచి ఉత్పత్తిలోకి తీసుకొచ్చారు. గతనెల 29న ఈ ప్లాంటులో బొగ్గు నిల్వ చేసే ఎలక్ట్రోస్టాటిక్‌ హాపర్స్‌ కూలాయి. దీంతో 800 మెగావాట్ల చొప్పున ఉత్పాదక సామర్థ్యం గల రెండు యూనిట్లలో 8 రోజుల పాటు ఉత్పత్తి నిలిచింది. రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్‌ కొరత దృష్ట్యా ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా మొదటి యూనిట్‌లో ఉత్పత్తి ప్రారంభించారు. సుమారు 350 మెగావాట్ల విద్యుత్‌ అందుబాటులోకి వచ్చింది. రెండో యూనిట్‌ను అందుబాటులోకి తేవడానికి మరో వారం పడుతుందని అధికారులు తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.