శాసన సభ్యుల కోటాలో ఎమ్మెల్సీ స్థానానికి వైకాపా తరఫున పోతుల సునీత నామినేషన్ రెండో సెట్‌ను దాఖలు చేశారు. సోమవారం శాసన మండలిలో ఎమ్మెల్సీ ఎన్నికల రిట్నరింగ్ అధికారి పీవీ సుబ్బారెడ్డికి ఆమె తన నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ నెల 11న తొలి సెట్ నామినేషన్ వేశారు. సునీత వెంట మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, అసెంబ్లీ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ఉన్నారు.
ఇదీ చదవండి