పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ జరిగింది. లింగమనేనికి చెందిన భవనంపై క్షేత్రస్థాయిలో పరిస్థితులను అధ్యయం చేసి వాస్తవాలను వెల్లడించేందుకు ఓ న్యాయాధికారితో కమిటీని ఏర్పాటు చేయాలని అడ్వొకేట్ జనరల్ ఎస్. శ్రీరామ్ కోర్టులో వాదనలు వినిపించారు. పిటిషనర్ నిర్మాణంతో పాటు పలు ఇతర నిర్మాణాలు కృష్ణా నదిలోకి చొచ్చుకుపోయి ప్రవహించే నీటిని తాకేలా ఉన్నాయని తెలిపారు. భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని నదులు ఆక్రమణకు గురి కాకుండా కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు . పూర్తి స్థాయి వాదనలు వినిపించేందుకు తగిన సమయం లేకపోవడంతో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె . విజయలక్ష్మి విచారణను ఈ నెల 23కు వాయిదా వేశారు.
ఇదీ చదవండి : లింగమనేని ఇంటికి ఎలాంటి అనుమతులు లేవు: ఆర్కే