తెలంగాణలోని అనుమతిలేని, అనధికార ప్లాట్లు, లేఅవుట్ల క్రమబద్దీకరణ కోసం దరఖాస్తు గడువు ఇవాళ్టితో ముగియనుంది. ఇక నుంచి అనుమతి లేని లేఅవుట్లలో ప్లాట్ల రిజిస్ట్రేషన్ ఉండబోదన్న ప్రభుత్వం... అనుమతి లేని స్థలాల్లో ఇండ్ల నిర్మాణానికి అనుమతి కూడా ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. చివరి అవకాశంగా క్రమబద్ధీకరణ చేయనున్నట్లు తెలిపింది. దీంతో క్రమబద్దీకరణకు బాగానే స్పందన వచ్చింది. దరఖాస్తు గడువు ఈ నెల 15వరకు ఉండగా 20 లక్షలకు పైగా దరఖాస్తులు ప్రభుత్వానికి వచ్చాయి.
హైదరాబాద్ నగరం, శివారు ప్రాంతాల్లో భారీ వర్షాల నేపథ్యంలో దరఖాస్తు గడువును రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ్టి వరకు పొడిగించింది. పొడిగింపు తర్వాత మరో నాలుగు లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. శుక్రవారం వరకు 24 లక్షలకు పైగా ఎల్ఆర్ఎస్ దరకాస్తులు వచ్చాయి. శుక్రవారం ఒక్కరోజే 70 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఇవాళ మరో లక్షకు పైగా దరఖాస్తులు రావచ్చని అంటున్నారు. దరఖాస్తుల ప్రక్రియ పూర్తవుతున్న నేపథ్యంలో ఇక వాటి పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించనుంది.
ఇవీ చూడండి: