ETV Bharat / city

రాజకీయ ఒత్తిళ్లతో భూముల చుక్కలు మారుతున్నాయి

author img

By

Published : Aug 19, 2022, 7:17 PM IST

ఇంతకుముందు కలెక్టర్ల అభిప్రాయాలను అనుసరించి భూ పరిపాలన శాఖ నిర్ణయం తీసుకునేది. అయితే కలెక్టర్లే స్వయంగా నిర్ణయాలు తీసుకోవచ్చునని ఇటీవల ఉత్తర్వులు ఇచ్చారు. గతానికి భిన్నంగా జిల్లాల్లో కొద్ది నెలల్లోనే వందలాది ఎకరాల చుక్కల భూమిని నిషిద్ధ జాబితా నుంచి తప్పించారు. అయితే ప్రస్తుతం వివిధ జిల్లాల్లో జరుగుతున్న చర్యలపై ఉన్నతస్థాయిలో నిశిత పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది.

Political Pressure on Chukka Lands  List
భూముల చుక్కలు

Dotted land list changing నిషిద్ధ జాబితా నుంచి చుక్కల భూములను గతానికి భిన్నంగా వేగంగా తొలగిస్తున్నారు. జిల్లాల కలెక్టర్ల నిర్ణయాలకు అనుగుణంగా రెవెన్యూ శాఖ చుక్కల భూములను నిషిద్ధ జాబితా నుంచి తప్పిస్తూ ఉత్తర్వులను జారీ చేస్తోంది. ఈ ప్రక్రియలో అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు అధికంగా పనిచేస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి ఉత్తర్వుల్లో అధిక భాగం కడప, అన్నమయ్య జిల్లాలకు చెందినవే ఉంటుండటం చర్చనీయాంశం అవుతోంది. ముఖ్యంగా ప్రొద్దుటూరు, రాయచోటి, రాజంపేట, కడప శివారులోని సీకే దిన్నె ప్రాంతాల్లోని ఎకరాలకొద్ది భూములను నిషిద్ధ జాబితా నుంచి తప్పించేస్తున్నారు. ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి, పెద్దశెట్టిపల్లి, చాపాడు మండలం పల్లవోలు, ఓబులవారిపాలెం మండల కేంద్రం, రాయచోటి మండలం చెర్లోపల్లి, జమ్మలమడుగు మండలం పెద్దనందలూరు, పులివెందుల మండలం అచ్చవల్లి గ్రామం, ముద్దనూరు మండల కేంద్రం, ఇతర ప్రాంతాల్లోని భూములపై చుక్కలు తొలగించారు. అయితే... సాధారణ వ్యక్తులు ఎవరైనా తమ భూములపై ఉన్న చుక్కలను తొలగించాలని దరఖాస్తు చేసుకుంటే పట్టించుకునే వారే ఉండరని, వాటికి సానుకూలంగా ఉత్తర్వులు రావడమే లేదనే విమర్శలు వస్తున్నాయి. ఈ రెండు జిల్లాల్లో గత కొద్ది నెలల్లోనే వందలాది ఎకరాల భూమిని నిషిద్ధ జాబితా నుంచి తప్పించారు. ఓ ప్రజాప్రతినిధి ప్రొద్దుటూరు సమీపంలో నిషిద్ధ జాబితాలో ఉన్న భూమిని తన పరిధిలోకి తీసుకుని... ఆ తర్వాత చుక్కల తొలగింపు ఉత్తర్వులు పొందినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

జిల్లా కలెక్టర్లదే తుది నిర్ణయం

ఆంగ్లేయుల హయాంలో ఆర్‌ఎస్‌ఆర్‌ (రీసర్వే సెటిల్‌మెంట్‌ రిజిస్టర్‌) తయారీలో తప్పిదాలు దొర్లాయి. ప్రైవేట్‌ భూముల రీ-సర్వే సమయంలో యజమానులు అందుబాటులో లేకుంటే... వాటివద్ద చుక్కలు పెట్టారు. ఇలాంటి భూములను నిషిద్ధ జాబితా నుంచి తప్పించేందుకు దరఖాస్తులు అందితే జిల్లాల కలెక్టర్ల అభిప్రాయాలను అనుసరించి భూ పరిపాలన శాఖ నిర్ణయం తీసుకునేది. అయితే... కలెక్టర్లే స్వయంగా నిర్ణయాలు తీసుకోవచ్చునని ఇటీవల ఉత్తర్వులు ఇచ్చారు. అప్పటి నుంచి కడప, అన్నమయ్య జిల్లాల్లో భూముల తొలగింపు ప్రక్రియ వేగం అందుకుంది. ఈ జిల్లాల్లో సుమారు 11 వేల దరఖాస్తులు ఇప్పటికీ పరిశీలన దశలో ఉన్నాయి. కర్నూలు జిల్లాలోనూ దరఖాస్తుల పరిష్కారం సాగుతోంది. ప్రకాశం జిల్లా కనిగిరి, సంతనూతలపాడు, బాపట్ల జిల్లా వేటపాలెం, నెల్లూరు జిల్లా కందుకూరు ప్రాంతాల్లో వందలాది ఎకరాలను నిషిద్ధ జాబితా నుంచి తప్పించారు. కృష్ణా జిల్లా మచిలీపట్టణం మండలం బందరు గ్రామం, విజయవాడ శివారు చల్లపల్లి మండలం చల్లపల్లి గ్రామం, నెల్లూరు రూరల్‌ మండలంలో జులై 27న 158 ఎకరాలపై చుక్కలను తొలగించారు.

పరిశీలనలో 72 వేల దరఖాస్తులు

చుక్కల భూములకు విముక్తి కల్పించాలని రాష్ట్రవ్యాప్తంగా 77 వేల వరకు దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 72 వేల దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి. అత్యధికంగా నెల్లూరు(13 వేలు), అనంతపురం(10,122), కర్నూలు(10 వేలు), పల్నాడు(9,500), నంద్యాల(6,800), ప్రకాశం(4,300), శ్రీసత్యసాయి(3,356), గుంటూరు జిల్లా(2 వేలు), ఇతర జిల్లాల్లో మరికొన్ని దరఖాస్తులను కలెక్టర్లు పరిశీలిస్తున్నారు. నెల్లూరు, కడప, అన్నమయ్య, అనంతపురం, శ్రీసత్యసాయి తదితర జిల్లాల నుంచి ఇప్పటికీ దరఖాస్తులు అందుతూనే ఉన్నాయి.

ప్రాథమికంగా ఇలా చేయాలి...

చుక్కల భూముల దరఖాస్తులను మొదట వీఆర్వో పరిశీలిస్తారు. తర్వాత తహసీల్దార్‌... ఆ భూములకు గతంలో రిజిస్ట్రేషన్లు జరిగాయా? లింకు డాక్యుమెంట్లు ఉన్నాయా? వంటి వాటిని తనిఖీ చేసి సిఫార్సు చేస్తారు. అనంతరం ఉన్నతాధికారులు పరిశీలించాక దస్త్రాన్ని కలెక్టరేట్‌కు పంపాలి. అయితే ప్రస్తుతం వివిధ జిల్లాల్లో జరుగుతున్న చర్యలపై ఉన్నతస్థాయిలో నిశిత పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.