గుంటూరు జిల్లా మందడం ప్రభుత్వ పాఠశాల సిబ్బందితో తల్లిదండ్రులు వాగ్వాదానికి దిగారు. రైతుల సహాయ నిరాకరణతో పోలీసులు పాఠశాలలో విశ్రాంతి తీసుకుంటున్నారు. తరగతి గదుల్లో పిల్లలను బయటకు పంపి గదుల్ని సేదతీరడానికి వినియోగించుకున్నారు. బల్లలపై ఉతికిన బట్టలు ఆరేశారు. పోలీసుల చర్యను గ్రామస్థులు తప్పుబట్టారు. తరగతి గదులు ఖాళీ లేక ఉదయం నుంచి విద్యార్థులు చెట్టునీడనే ఉన్నారు. తమ పిల్లలను బయటకు ఎలా పంపుతారంటూ తల్లిదండ్రులు నిలదీశారు. దీంతో ప్రధానోపాధ్యాయులు పాఠశాలకు సెలవు ప్రకటించారు.
ఇవీ చదవండి..
కేసు పెట్టి రిమాండ్కు పంపిస్తా'.. తెదేపా నేతలకు ఎస్సై వార్నింగ్