ETV Bharat / city

జైలుకు అఖిలప్రియ... ఎఫ్​ఐఆర్​లో మరో ఇద్దరి పేర్లు

ప్రవీణ్‌రావు సోదరుల అపహరణ కేసులో 3 రోజుల విచారణలో అఖిలప్రియ స్టేట్‌మెంట్​ను పోలీసులు రికార్డ్ చేశారు. అఖిలప్రియను న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచి... అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించారు. బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసు ఎఫ్ఐఆర్‌లో మరికొందరిని పోలీసులు చేర్చారు.

జైలుకు అఖిలప్రియ... ఎఫ్​ఐఆర్​లో మరో ఇద్దరి పేర్లు
జైలుకు అఖిలప్రియ... ఎఫ్​ఐఆర్​లో మరో ఇద్దరి పేర్లు
author img

By

Published : Jan 14, 2021, 11:28 PM IST

హైదారాబాద్ బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో ప్రధాన నిందితురాలు భూమా అఖిలప్రియను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. మూడ్రోజుల కస్టడీ అనంతరం మారేడ్‌పల్లిలో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. ఆ తర్వాత చంచల్‌గూడ జైలుకు తరలించారు. బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసు ఎఫ్ఐఆర్‌లో మరికొందరిని పోలీసులు చేర్చారు. భార్గవరామ్‌ తమ్ముడు చంద్రహాస్, తల్లి కిరణ్మయిని చేర్చారు. నిందితులు పారిపోయే వరకు సాయం చేసిన ఇద్దరిపై కేసు నమోదు చేశారు.

అఖిలప్రియ తరఫున న్యాయవాదులు బెయిల్ పిటిషన్‌ దాఖలు చేయగా.. ఎల్లుండి విచారణ జరుపుతామని కోర్టు తెలిపింది. అంతకుముందు అఖిలప్రియకు గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. బేగంపేట పీహెచ్​సీలో కరోనా పరీక్షలు నిర్వహించగా.. నెగెటివ్‌గా నిర్ధరణ అయింది. గాంధీ ఆస్పత్రిలో ఈసీజీతో పాటు పలు పరీక్షలు నిర్వహించారు. గైనకాలజీ విభాగంలోనూ అఖిలప్రియకు పరీక్షలు చేయించారు.

ఇదీ చదవండి: కిడ్నాప్​ ప్లాన్​ ఎవరిది.. అప్పుడు అఖిలప్రియ ఎక్కడున్నారు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.