ETV Bharat / city

TELANGANA: స్వాతంత్య్ర దినోత్సవ పరేడ్​ కోసం పోలీసుల రిహార్సల్స్ - గోల్కొండ కోటలో ఆగస్టు 15న వేడుకలు

పంద్రాగస్టు పరేడ్​ కోసం తెలంగాణ పోలీసులు సన్నద్ధమవుతున్నారు. 4 రోజులుగా రిహార్సల్స్​ చేస్తూ.. స్వాతంత్య్ర దినోత్సవం రోజు పరేడ్​ కోసం సిద్ధమవుతున్నారు. ఈసారి కొత్తవాళ్లతో పరేడ్​ నిర్వహిస్తుండగా... పూర్తి సన్నద్ధతతో ఉండేలా రిహార్సల్స్​ నిర్వహిస్తున్నారు.

PARADE Rehearsal AT GOLKONDA
స్వాతంత్య్ర దినోత్సవ పరేడ్​ కోసం పోలీసుల రిహార్సల్స్
author img

By

Published : Aug 13, 2021, 10:09 PM IST

స్వాతంత్య్ర దినోత్సవ పరేడ్​ కోసం పోలీసుల రిహార్సల్స్

హైదరాబాద్ - గోల్కొండ కోటలో ఆగస్టు 15న నిర్వహించే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాటు పూర్తి చేసినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​ కుమార్, జిల్లా కలెక్టర్ ఎల్.శర్మన్ తెలిపారు. స్వాతంత్య్ర వేడుకలను పురస్కరించుకుని నిర్వహించే పరేడ్ రిహార్సల్​ను గోల్కొండలో నిర్వహించారు. సీఎం కాన్వాయ్ రిహార్సల్ కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్​ కుమార్, అడిషనల్ ట్రాఫిక్ కమిషనర్ అనిల్ కుమార్ పాల్గొన్నారు.

75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్.. గోల్కొండపై జాతీయ జెండా ఎగురవేయనున్నారు. అందుకనుగుణంగా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. కోట ప్రాంగణంలో సఫాయి కార్మికులు పారిశుద్ధ్య పనులను పూర్తి చేశారు. ముఖ్యమంత్రి ప్రాంగణానికి చేరుకున్న తర్వాత పోలీసులు స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత సీఎం గౌరవ వందనం స్వీకరిస్తారు. జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం పోలీసులు పరేడ్ నిర్వహిస్తారు. పరేడ్ కోసం గోల్కొండ ప్రాంగణంలో నాలుగు రోజులుగా పోలీసులు రిహార్సల్స్ నిర్వహిస్తున్నారు.

ఈ సారి కొత్తవాళ్లతో కవాతు నిర్వహిస్తున్నట్టు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. పూర్తి సన్నద్ధతతో ఉండేలా రిహార్సల్స్​ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పారిశుద్ధ్య నిర్వహణను పర్యవేక్షిస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు పేర్కొన్నారు.

ఇదీ చూడండి:

CM Jagan: ఉద్యాన రైతుల ఆదాయం పెంచేందుకు చర్యలు చేపట్టండి: సీఎం జగన్​

CS Meeting with IAS officers: 'ఐఏఎస్ అధికారులూ.. సచివాలయానికి రండి!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.