ETV Bharat / city

రక్తదానాలు.. మెడికల్ క్యాంపులు @ పోలీసుల వారోత్సవాలు

author img

By

Published : Oct 16, 2019, 7:38 PM IST

పోలీసుల అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా.. నిర్వహిస్తున్న వారోత్సవాలు.. రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్నాయి. పలు చోట్ల రక్తదాన శిబిరాలు, మెడికల్ క్యాంపులు నిర్వహించారు. ఓపెన్‌హౌస్‌ కార్యక్రమంలో విద్యార్థులకు అవగాహన కలిగించారు.

police-mega-medical-camp-in-ap
రాష్ట వ్యాప్తంగా పోలీసుల అమరవీరుల దినోత్సవం వారోత్సవాలు

పోలీసుల అమరవీరుల దినం సందర్భంగా.. రాష్ట్రవ్యాప్తంగా వారోత్సవాలు కొనసాగుతున్నాయి. రక్తదాన శిబిరాలు, వైద్య సేవల క్యాంపులతో పోలీసులు సేవా కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తున్నారు. కృష్ణా జిల్లా పెనుమలూరులో.. ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానంలో భాగంగా.. ప్రజలకు కావలసిన అవసరాలను గుర్తించి.. సమస్యలు పరిష్కరించేలా తగిన చర్యలు తీసుకుంటున్నామని డీసీపీ చెప్పారు. అవనిగడ్డలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పలువురు పోలీసు అధికారులు రక్తదానం చేశారు. ఎక్కువసార్లు రక్తదానం చేసిన వారిని సత్కరించి జ్ఞాపికలు బహుకరించారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో రక్తదాన శిబిరంతో పాటు... ఓపెన్‌ హౌస్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. కర్నూలు, చిత్తూరు జిల్లా పుత్తూరులో పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు కొనసాగిస్తున్నారు.

Intro:పోలీసులు ప్రజలతో స్నేహపూర్వకంగా మెలిగే విధంగా ఇప్పటికే చర్యలు చేపట్టామని విజయవాడ డిసిపి హర్షవర్ధన్ రాజు అన్నారు.

Body:పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలంలోని ఈడుపుగల్లు గ్రామంలో ఏర్పాటుచేసిన ఉచిత మెగా మెడికల్ క్యాంపు ప్రారంభించారు.

Conclusion:ఈ సందర్భంగా డి సి పి మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వ అధికారుల పైన నమ్మకం ఏర్పడి ఏవిధంగా తీసుకునే చర్యల్లో భాగంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఫ్రెండ్లీ పోలీసింగ్ కాన్సెప్ట్ తో ప్రజలకు కావలసిన అవసరాలను గుర్తించి వాటి ద్వారా ప్రజలకు దగ్గర అవుతున్నట్లు పేర్కొన్నారు. కంకిపాడు సర్కిల్ పరిధిలో పోలీసులు ఏర్పాటు చేసినటువంటి మెడికల్ క్యాంపు విశేష స్పందన లభించిందని ఇటువంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేసే విధంగా ముందుకు వెళ్తామని చెప్పారు. కార్యక్రమానికి additional డిసిపి బాల కోటేశ్వరరావు, ఏసిపి సురేంద్ర నాథ్ రెడ్డి ,సి ఐ శివాజీ రాజు ,ఎస్ ఐ లు షరీఫ్, శాతకర్ణి, సత్యనారాయణ పాల్గొన్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.