ETV Bharat / city

పోలీసు‌ అమరవీరులకు సీఎం జగన్‌ నివాళి

విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియం వేదికగా జరుగుతున్న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాల్లో..... అమరవీరులకు సీఎం జగన్‌ నివాళులర్పించారు. ప్రతి పోలీసు కుటుంబానికి సమాజం జేజేలు పలుకుతోందని జగన్ అన్నారు.

CM Jagan pays tribute to police martyrs
పోలీసు‌ అమరవీరులకు సీఎం జగన్‌ నివాళి
author img

By

Published : Oct 21, 2020, 9:40 AM IST

విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం కార్యక్రమంలో సీఎం జగన్‌ పాల్గొన్నారు. పోలీసుల నుంచి సీఎం గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పోలీసు అమరవీరుల వివరాలతో కూడిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు హోంమంత్రి సుచరిత కూడా పాల్గొన్నారు. నేటి నుంచి ఈ నెల 31 వరకూ పోలీసు సంస్మరణ దినాలు జరగనున్నాయి. నేడు పోలీసులకు ఏర్పాటు చేసిన పలు క్రీడలను సీఎం జగన్‌ ప్రారంభించనున్నారు.

రక్షణలో రాజీలేదు: సీఎం

విధి నిర్వహణలో అనేకమంది పోలీసులు అమరులయ్యారని.. వారిని దేశమంతా స్మరించుకుంటోందని సీఎం జగన్ అన్నారు. ప్రతి పోలీసు కుటుంబానికి సమాజం జేజేలు పలుకుతోందని జగన్ కొనియాడారు. మహిళలు, పిల్లలు, వృద్ధుల రక్షణలో పోలీసులు ఏమాత్రం రాజీ పడవద్దని.... బడుగు, బలహీన వర్గాల వారిపై కులపరమైన దాడులు జరిగితే ఉపేక్షించవద్దన్నారు. తీవ్రవాదం, అసాంఘిక శక్తులను ఏమాత్రం ఉపేక్షించవద్దని సీఎం తెలిపారు. రాష్ట్రంలో 18 'దిశ' పోలీసుస్టేషన్లు ఏర్పాటు చేసి మహిళలకు బాధ్యత అప్పగించామని ఈ సందర్భంగా సీఎం గుర్తు చేశారు.

అమరుల కుటుంబాలకు అండగా ఉంటాం:హోంమంత్రి

పోలీసు ఉద్యోగుల బాధలపై సీఎంకు పూర్తి అవగాహన ఉందని హోంమంత్రి సుచరిత స్పష్టం చేశారు. కరోనా కాటుకు కొంతమంది పోలీసులు అమరులయ్యారని...వారి కుటుంబాలకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని హోంమంత్రి తెలిపారు.

వారి మరణం అందరికీ ఆదర్శం: డీజీపీ

అనేకమంది పోలీసులు వీర మరణం పోలీసులందరికీ ఆదర్శమని డీజీపీ గౌతమ్‌సవాంగ్‌ అన్నారు. దేశ అభివృద్ధికి శాంతి భద్రతలు అవసరమని...సవాళ్లను ఎదుర్కోవడానికి పోలీసులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని డీజీపీ స్పష్టం చేశారు. కరోనాతో మృతిచెందిన పోలీసులకు రూ.50 లక్షలు సీఎం ప్రకటించారని డీజీపీ తెలిపారు.

ఇదీ చదవండి:

రోజు మార్చి రోజు తరగతులు: సీఎం జగన్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.