ETV Bharat / city

రోబో సినిమాలో 'సనా' మాదిరి పరీక్ష రాద్దామనుకున్నాడు.. చివరికి! - cyber crime latest news

చక్కగా చదువుకుని కొలువు సాధించరా అంటే.. చావు తెలివి తేటలు ప్రదర్శించి చిప్పకూడు తినే పరిస్థితి తెచ్చుకున్నాడు హరియాణాకు చెందిన ఓ యువకుడు. అత్యంత పకడ్బందీగా నిర్వహించే వైమానికదళ పరీక్షల్లోనే కాపీ కొట్టేందుకు ప్రయత్నించి కటకటాలపాలయ్యాడు.

Hi-tech copying in exams
పరీక్షలలో హైటెక్​ కాపీయింగ్
author img

By

Published : Jul 21, 2021, 9:49 AM IST

సినిమాలు చూసి స్ఫూర్తిని పొందాడో.. లేక సొంత ఐడియానో తెలియదు గానీ.. ఓ యువకుడు వాయుసేనలో కొలువు కోసం హైటెక్​ కాపీయింగ్​కు విఫలయత్నం చేశాడు. రోబో సినిమాలో చిట్టి చెబుతుంటే చెవిలో రిసీవర్​ పెట్టుకుని సన పరీక్ష రాసిన సీన్​ను.. అచ్చుగుద్దినట్టు దించేద్దామనుకున్నాడు. యూట్యూబ్ సాయంతో ఓ పరికరం తయారు చేశాడు. స్నేహితుల సాయంతో ట్రయల్స్​ నిర్వహించాడు. అది విజయవంతం కావడంతో ఇక మనకు తిరుగు లేదంటూ పరీక్షకు బయల్దేరాడు. అంతా సవ్యంగా సాగుతుందన్న సమయంలో.. ఇన్విజిలేటర్​కు చిక్కి కటకటాల పాలయ్యాడు.

హరియాణాకు చెందిన సౌరభ్.. ఇంటర్​ పూర్తి చేసి డిగ్రీ చదువుతున్నాడు. వాయుసేనలో ఎయిర్మెన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్​ వస్తే.. దరఖాస్తు చేసుకున్నాడు. ఈ నెల 18న హైదరాబాద్​లోని ఓ కేంద్రంలో పరీక్ష కోసం అడ్మిట్​ కార్డు వచ్చింది. చదవకుండానే పరీక్షలో గట్టెక్కాలనుకున్న సౌరభ్.. ఓ హైటెక్​ పరికరాన్ని తయారు చేసుకున్నాడు. పరీక్ష కేంద్రం వద్ద దాన్ని లోదుస్తుల్లో దాచుకుని సెక్యూరిటీ కళ్లు గప్పాడు. లోనికి వెళ్లాక.. రిసీవర్​ను చెవిలో.. మరో పరికరాన్ని బనియన్​కు అమర్చుకున్నాడు. ఇక్కడ తాను ప్రశ్నలు చదివితే.. తన స్నేహితులు సమాధానాలు చెప్పేలా ముందే ఏర్పాటు చేసుకున్నాడు. అంతా పక్కాగా ప్లాన్​ చేసుకున్నా... పరీక్షా కేంద్రంలోని సీసీ కెమెరాల్లో అతడి కదలికలు.. ఇన్విజిలేటర్లకు అనుమానం కలిగించాయి. వెళ్లి తనిఖీ చేయగా.. హైటెక్​ కాపీయింగ్​ గుట్టంతా రట్టయింది. పోలీసులను పిలిచి నిందితుడిని వారికి అప్పగించారు. పోలీసు విచారణలో పరికరాన్ని తానే తయారు చేశానని సౌరభ్​ ఒప్పుకున్నాడు. అతనికి సహకరించిన వారి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.

హైటెక్ పద్ధతిలో కాపీ కొట్టడమెలా అని గూగూల్​లో వెతికాడు. కొన్ని వీడియోలు చూశాడు. కొందరు మిత్రులను సంప్రదిస్తే.. గూగుల్, యూట్యూబ్ చూడమని సలహా ఇచ్చారు. అక్కడ సూచించిన విధంగా కంప్యూటర్ హార్ట్​వేర్ దుకాణానికి వెళ్లి రిసీవర్, ఇతరత్రా పరికరాలు, సిమ్ కార్డులను కొనుగోలు చేశాడు. రెండు, మూడ్రోజులు శ్రమించి.. ఇక్కడ ప్రశ్నలు చదువుతుంటే.. అటు వైపు నుంచి సమాధానాలు చెప్పేలా పెన్​డ్రైవ్​ మాదిరి ప్రత్యేక ఎలక్ట్రానిక్ పరికరాన్ని (మైక్రో ఎలక్ట్రానిక్ డివైస్) తయారు చేశాడు. చెవిలో రిసీవర్ పెట్టుకుని.. అటువైపు నుంచి సమాధానాలు చెబుతుంటే.. విని పరీక్ష రాసి గట్టిక్కాలనుకున్నాడు. రెండు, మూడుసార్లు పరీక్షించి, సక్రమంగానే పని చేస్తుందని నిర్ధారించుకున్నాడు. అనంతరం హైదరాబాద్ చేరుకుని పరీక్షకు హాజరయ్యాడు. చివరికి ఇన్విజిలేటర్ల చేతికి చిక్కి కటకటాల పాలయ్యాడు.

ఇదీ చూడండి:

ఆ సంస్థలో చేరితే.. 'వర్క్​ ఫ్రం దుబాయ్​- బీఎండబ్ల్యూ బైక్​'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.