ETV Bharat / city

తెలంగాణ: పోలీసులపై కుక్కలను వదిలిన వైకాపా నేత పీవీపీ

author img

By

Published : Jun 29, 2020, 4:19 PM IST

Updated : Jun 29, 2020, 7:51 PM IST

హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో సినీనిర్మాత, వైకాపా నేత పొట్లూరి వరప్రసాద్‌(పీవీపీ)పై మరో కేసు నమోదయింది. కేసు దర్యాప్తులో భాగంగా.. ఇంటికి వెళ్తే తమపైకి కుక్కలను వదిలారంటూ.. బంజారాహిల్స్ ఎస్సై హరీశ్‌ ఫిర్యాదు చేశారు.

police-file-case-on-pvp
సినీనిర్మాత, వైకాపా నేత పొట్లూరి వరప్రసాద్‌

సినీ నిర్మాత, వైకాపా నేత ప్రసాద్‌ వి.పొట్లూరి(పీవీపీ)పై హైదరాబాద్​ బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇటీవల పీవీపీపై నమోదైన ఒక కేసు విచారణకు సంబంధించి పలువురు పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో వారిపైకి పీవీపీ తన పెంపుడు కుక్కలను ఉసిగొల్పారు. ఈ హఠాత్పరిణామంతో ఖంగుతున్న పోలీసులు ఆయన ఇంటి నుంచి బయటకు వచ్చేశారు. ఈ ఘటనపై జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. విచారణకు వెళ్తే తమపై కుక్కలను ఉసిగొల్పారని ఎస్సై హరీశ్‌రెడ్డి ఫిర్యాదు చేయగా, ఐపీసీ 353కింద పీవీపీపై కేసు ఫైల్‌ చేశారు.

గతవారం పీవీపీపై బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ఇంటి నిర్మాణాన్ని అడ్డుకుని దౌర్జన్యం చేస్తున్నారంటూ సదరు వ్యక్తి ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా జూబ్లీహిల్స్‌లోని రోడ్‌ నెం.82లో ఉన్న పీవీపీ ఇంటికి పోలీసులు వెళ్లగా, ఈ ఘటన చోటు చేసుకుంది.

ఇవీ చూడండి: పీపీఈ కిట్ల ఎగుమతికి కేంద్రం ఓకే

Last Updated : Jun 29, 2020, 7:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.