ETV Bharat / city

రాష్ట్ర పోలీసు ఫిర్యాదుల అథారిటి సభ్యుల నియామకం

రాష్ట్ర పోలీసు ఫిర్యాదుల అథారిటికి సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ స్టేట్ పోలీసు కంప్లైంట్స్ అథారిటీకి 3 సభ్యులను నియమిస్తూ ఆదేశాలు ఇచ్చింది. జిల్లా స్థాయిలోనూ ఛైర్మన్​లు, సభ్యుల నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

police complaints authority
పోలీసు ఫిర్యాదుల అథారిటి
author img

By

Published : Jul 9, 2021, 12:52 AM IST

రాష్ట్ర పోలీసు ఫిర్యాదుల అథారిటీకి సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఏపీ స్టేట్ పోలీసు కంప్లైంట్స్ అథారిటీకి 3 సభ్యులను నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఇప్పటికే ఈ సంస్థకు ఛైర్మన్​గా మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కనగరాజ్​ను ప్రభుత్వం నియమించింది. ఇక రాష్ట్ర స్థాయి అథారిటీకి సభ్యులుగా విశ్రాంత ఐపీఎస్ అధికారి కె.వి.వి.గోపాలరావును, విశ్రాంత ఐఎఎస్ అధికారి బి.కిషోర్, ఉదయ లక్ష్మిని సభ్యులుగా నియమిస్తూ ఆదేశాలు విడుదల అయ్యాయి. పోలీసు కంప్లైట్స్ అథారిటీ సభ్యుల కాలవ్యవధి మూడేళ్ల పాటు లేదా 65 ఏళ్ల వయసు వచ్చే వరకూ ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. జిల్లా స్థాయిలోనూ ఛైర్మన్​లు, సభ్యుల నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. మూడేసి జిల్లాలకు ఒక ఛైర్మన్​ను ఇద్దరేసి సభ్యుల్ని ప్రభుత్వం నియమించింది. విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు విశ్రాంత జిల్లా అదనపు న్యాయమూర్తి అనింగి వరప్రసాద రావును చైర్మన్​గా ప్రభుత్వం నియమించింది.

జిల్లాలకు..

ఉభయగోదావరి, కృష్ణా జిల్లాలకు విశ్రాంత జిల్లా జడ్జి ఆర్జే విశ్వనాథంను నియమించారు. గుంటూరు,ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు విశ్రాంత అదనపు జిల్లా న్యాయమూర్తి నేతల రమేష్ బాబును ప్రభుత్వం నియమించింది. కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాలకు విశ్రాంత జిల్లా న్యాయమూర్తి కుప్పం వెంకట రమణా రెడ్డిని నియమించారు. జిల్లాల కమిటీల సభ్యులుగా విశ్రాంత డీఎస్పీలు, విశ్రాంత పాలనాధికారులను ప్రభుత్వం నియమించింది.

ఇదీ చదవండి:

తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు నిలువరించండి: కేంద్రానికి రాష్ట్ర జలవనరుల శాఖ లేఖ

కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.