కృష్ణా జిల్లా నందిగామ పోలీసు స్టేషన్లో తెదేపా అధినేత చంద్రబాబుపై కేసు నమోదయ్యింది. కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో హైదరాబాద్ నుంచి విజయవాడకు రోడ్డు మార్గాన వచ్చి లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించారని న్యాయవాది బి.శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. జగ్గయ్యపేట, నందిగామ, కంచికచర్లలో భారీగా జన సమీకరణ చేపట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి:
విజయవాడలో విద్యార్థుల గ్యాంగ్ వార్.. పలువురికి తీవ్ర గాయాలు