మీది ఏ ఊరు..?... మీరే పార్టీ...?... మీదే కులం..?... ఇదీ అమరావతి ఉద్యమంలో అరెస్టైన మహిళలను పోలీసులు విచారించే విధానం. . కృష్ణలంక స్టేషన్‌లో ఇతర వివరాలతో పాటు కులం పేరు చెప్పాలని ఒత్తిడి చేశారు. ఫొటోలు కూడా తీసుకోవడంతో.. వారు వ్యతిరేకించారు. తాము దొంగలమా.. దోపిడీదారులమా ఫొటోలు ఎందుకంటూ మహిళలు ఎదురుతిరిగారు. రాత్రి 7.30 గంటలకు తెదేపా నేతలు, అమరావతి ఐకాస నేతలు వచ్చినా వారిని పోలీసులు విడుదల చేయలేదు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అక్కడికి వెళ్లి పోలీసులతో మాట్లాడగా.. ఎట్టకేలకు రాత్రి 9 గంటలకు విడుదల చేశారు. నున్న పోలీస్‌స్టేషన్‌లోనూ సాయంత్రం 6 గంటలయినా మహిళలను విడిచిపెట్టలేదని పెద్దఎత్తున నినాదాలు చేశారు.
ఇదీ చదవండి