ETV Bharat / city

State bandh: రాష్ట్ర బంద్​పై పోలీసుల ఉక్కుపాదం.. పలుచోట్ల ఉద్రిక్తత - ycp attack on tdp central office latest news

పార్టీ కార్యాలయాలపై దాడులకు నిరసనగా తెదేపా చేపట్టిన బంద్​ పలుచోట్ల ఉద్రిక్తతలకు దారితీసింది. ఉదయం నుంచే పలువురు నేతలను అరెస్ట్​ చేశారు. ఇంటి నుంచి బయల్దేరకుండా గృహ నిర్బంధాలు చేశారు. ఎదురొడ్డి రోడ్డెక్కితే స్టేషన్‌కు తరలించారు. పోలీసులు అడ్డుకోవడం, ఈడ్చుకెళ్లడం, అరెస్టులు, నిర్బంధాలతో రాష్ట్రం దద్దరిల్లింది.

రాష్ట్ర బంద్​పై పోలీసుల ఉక్కుపాదం
రాష్ట్ర బంద్​పై పోలీసుల ఉక్కుపాదం
author img

By

Published : Oct 20, 2021, 10:05 PM IST

తెలుగుదేశం కార్యాలయాలపై దాడులకు(attack on TDP offices) నిరసనగా ఆ పార్టీ నేతలు చేపట్టిన రాష్ట్ర బంద్‌(state bandh)పై పోలీసులు ఎక్కడికక్కడ ఉక్కుపాదం మోపారు. కృష్ణా జిల్లా(krishna district)లో అరెస్టులు, నిర్బంధాల పర్వం కొనసాగింది. గుడివాడ, పామర్రు, మచిలీపట్నం, నందిగామ, కోడూరు, నాగాయలంక, నూజివీడు, మైలవరం, పెనుగంచిప్రోలు పరిధిలో పలువురు నేతలను అరెస్టు(arrest) చేసి స్టేషన్‌కు తరలించారు. కొన్నిచోట్ల పార్టీ శ్రేణులను ఈడ్చుకుంటూ స్టేషన్‌కు తరలించారు. మాజీ మంత్రి దేవినేని ఉమ(devineni uma) ద్విచక్రవాహనంపై వచ్చి జాతీయ రహదారిపై బైఠాయించేందుకు యత్నించగా... గొల్లపూడిలో అరెస్ట్ చేశారు. అల్లీపురంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. గుంటూరులో ఆందోళన చేస్తున్న నాయకులు, శ్రేణులను అరెస్టు చేసి నల్లపాడు స్టేషన్‌(nallapadu police station)కు తరలించారు. జిల్లాలో చాలాచోట్ల నిరసనకు వెళ్తున్న నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. చాలా మందిని గృహనిర్బంధం చేశారు. చింతలపూడిలో ధూళిపాళ్ల నరేంద్ర(dhulipalla narendra)ను, గుంటూరులో నక్కా ఆనంద్ బాబు(nakka anandh babu)ను గృహనిర్బంధం చేశారు. రాబోయే రోజుల్లో వైకాపా ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని నేతలు హెచ్చరించారు.(warning)

రాష్ట్ర బంద్​పై పోలీసుల ఉక్కుపాదం

ఎక్కడికక్కడ గృహనిర్బంధం...

విజయనగరం జిల్లా(vizianagaram district) సాలూరు, చీపురుపల్లిలో నిరసన తెలుపుతున్న తెలుగుదేశం నేతలను పోలీసులు స్టేషన్‌కు తరలించారు. శ్రీకాకుళం జిల్లాలో ఆ పార్టీ శ్రేణులను ఎక్కడికక్కడ నిర్బంధించారు. ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఆందోళనలో పాల్గొన్న ఎంపీ రామ్మోహన్ నాయుడు(MP rammohan naidu), మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజాంలో పొలిట్ బ్యూరో సభ్యుడు కళా వెంకట్రావు(kala venkatrav) ఇంటి గేటుకు లీసులు తాళాలు వేశారు. విశాఖలో తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో పాటు మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తిని పోలీసులు గృహనిర్బంధం(house arrest)లో ఉంచారు. పోలీసుల తీరుపై బండారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అరకు లోయలో మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్(kidari sravan kumar) ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు బంద్ నిర్వహించాయి.

ఉద్రిక్త పరిస్థితుల నడుమ...

ఉభయగోదావరి జిల్లాల్లో(godavari districts) తెలుగుదేశం శ్రేణులు పెద్దఎత్తున ఆందోళనకు దిగాయి. రాజమహేంద్రవరం(rajamahendravaram)లో ఆందోళన చేస్తున్న కార్యకర్తలను పోలీసులు బలవంతంగా లాక్కెళ్లారు. కొందరు నేతలకు గాయాలయ్యాయి. తెలుగుదేశం సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరిని(gorantla buchaiah chowdary) పోలీసులు గృహనిర్బంధం చేశారు. అమలాపురంలో ఆనందరావు, పెదవేగి మండలం దుగ్గిరాలలో చింతమనేని ప్రభాకర్‌(chinthamaneni prabhakar)ను పోలీసులు నిలువరించారు. పాలకొల్లులో ఎమ్మెల్యే రామానాయుడు(MLA ramanaidu) గృహనిర్బంధం ఉద్రిక్తతకు దారితీసింది.

అరెస్టులు...అడ్డగింతలు...

అనంతపురం జిల్లా(ananthapuram district)లో నేతలను పోలీసులు ఎక్కడికక్కడే గృహనిర్బంధం చేశారు. కళ్యాణదుర్గం తెలుగుదేశం నియోజకవర్గ ఇంఛార్జ్ ఉమామహేశ్వర్ నాయుడును బయటకు వెళ్ళనీయకుండా పోలీసు జీపు అడ్డంపెట్టి అడ్డుకున్నారు. అనంతపురంలో కాలవ శ్రీనివాసులు(kalava srinivasulu), పెనుగొండ మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిని వారి ఇళ్లదగ్గరే అడ్డుకున్నారు. హిందూపురం, కదిరిలో ఆ పార్టీ నేతలను బలవంతంగా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. కర్నూలు జిల్లా(kurnool district) ఎమ్మిగనూరు, బనగానపల్లె, నంద్యాల, ఆదోని, డోన్‌లో ఆ పార్టీ కీలక నేతలను హౌస్ అరెస్టు చేశారు. కడప జిల్లా(kadapa district)లోనూ సింహాద్రిపురంలో ఎమ్మెల్యే బీటెక్ రవిని, ప్రొద్దుటూరులో మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డినీ గృహ నిర్బంధం చేశారు. రాయచోటి, ప్రొద్దుటూరులోనూ ఉద్రిక్తతలు కొనసాగాయి. చిత్తూరు జిల్లా(chithore district) చంద్రగిరి నియోజకవర్గపరిధిలోని 6 మండలాల్లో పార్టీ కీలక నేతలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. నెల్లూరు జిల్లాలో పార్టీ నేతలను గృహనిర్బంధం చేసినప్పటికీ మరికొందరి ఇళ్ల దగ్గర పోలీసులను మోహరించారు. ప్రకాశం జిల్లాలో(prakasham district)నూ దాదాపు ఇదే పరిస్థితి కొనసాగింది.

అనుబంధ కథనాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.