పోలవరం ప్రధాన డ్యాం, జలవిద్యుత్ కేంద్ర పనులకు కలిపి జలవనురుల శాఖ ఆహ్వానించిన టెండర్ నోటీసులకు ఒకే ఒక్క గుత్తేదారు ఏజెన్సీ సంస్థ స్పందించింది. మేఘా ఇంజనీరింగ్ సంస్థ మాత్రమే గడువులోగా తన బిడ్ ను దాఖలు చేసింది. ప్రీబిడ్ సమావేశానికి దాదాపు 8సంస్థలు హాజరై తమ సందేహాలు నివృత్తి చేసుకున్నా గడువు ముగిసే నాటికి మేఘా సంస్థ ఒక్కటే బిడ్ వేసింది. దీంతో సింగిల్ టెండర్ మాత్రమే దాఖలైనట్లుంది. ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 23న ఆర్థిక బిడ్ తెరవాలి. రివర్స్ టెండర్లు నిర్వహించాలి. ప్రస్తుతం ఒకే ఒక్క సంస్థ టెండరు దాఖలు చేయటంతో జలవనరులు శాఖ ఎలా ముందుకు వెళ్తుందనేది చర్చనీయాంశమైంది.
ప్రధాన డ్యాం వద్ద మిగిలి ఉన్న పనులకు రూ. 1771.44 కోట్లు, 960 మెగావాట్ల విద్యుత్ కేంద్రం పనులకు రూ.3216.11కోట్ల అంచనా విలువతో జల వనరుల శాఖ టెండర్లను ఆహ్వానించింది. గడువులోగా మేఘా సంస్థ ఒక్కటే టెండరుకు సంబంధించిన అసలు డాక్యుమెంట్లను, బ్యాంకు గ్యారెంటీ పత్రాలను సమర్పించింది. గతంలో ఈ రెండు పనులను నవయుగ వేర్వేరుగా చేపట్టింది.
ప్రభుత్వ మారక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి వారి నివేదిక మేరకు ప్రభుత్వం నవయుగతో కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేసుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా రెండు పనులనూ కలిపి జలవనరుల శాఖ టెండర్లను ఆహ్వానించింది. రివర్స్ టెండర్ల ప్రక్రియలో బిడ్లను ఆహ్వానించింది. ఈ పనులకు గుత్తేదారు సంస్థలు బిడ్లు దాఖలు చేసేందుకు శుక్రవారం తుది గడువు. శనివారం సాయంత్రం ఐదింటిలోపు టెండరు దాఖలుకు సంబందించిన అసలు డాక్యుమెంట్లు, బ్యాంకు గ్యారెంటీ పత్రాలును పోలవరం అధికారుల సమర్పించాలి. శనివారం సాయంత్రంతో గడువు ముగియగా మేఘా ఇంజనీరింగ్ కంపెనీ ఒక్కటే వీటిని సమర్పించింది. ఈ విషయాన్ని జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్ ధ్రువీకరించారు.
పోలవరం టెండరు నోటీసుకు స్పందన కరవు...బరిలో మేఘా మాత్రమే
పోలవరం ప్రధాన డ్యాం , జలవిద్యుత్ కేంద్రం పనులకు కలిపి జలవనరుల శాఖ ఆహ్వానించిన టెండరు నోటీసుకు స్పందన కరవైంది. ఒకే ఒక్క గుత్తేదారు ఏజెన్సీ స్పందించింది. మేఘా ఇంజినీరింగ్ సంస్థ మాత్రమే గడువులోగా తన బిడ్‌ను దాఖలు చేసింది.
పోలవరం ప్రధాన డ్యాం, జలవిద్యుత్ కేంద్ర పనులకు కలిపి జలవనురుల శాఖ ఆహ్వానించిన టెండర్ నోటీసులకు ఒకే ఒక్క గుత్తేదారు ఏజెన్సీ సంస్థ స్పందించింది. మేఘా ఇంజనీరింగ్ సంస్థ మాత్రమే గడువులోగా తన బిడ్ ను దాఖలు చేసింది. ప్రీబిడ్ సమావేశానికి దాదాపు 8సంస్థలు హాజరై తమ సందేహాలు నివృత్తి చేసుకున్నా గడువు ముగిసే నాటికి మేఘా సంస్థ ఒక్కటే బిడ్ వేసింది. దీంతో సింగిల్ టెండర్ మాత్రమే దాఖలైనట్లుంది. ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 23న ఆర్థిక బిడ్ తెరవాలి. రివర్స్ టెండర్లు నిర్వహించాలి. ప్రస్తుతం ఒకే ఒక్క సంస్థ టెండరు దాఖలు చేయటంతో జలవనరులు శాఖ ఎలా ముందుకు వెళ్తుందనేది చర్చనీయాంశమైంది.
ప్రధాన డ్యాం వద్ద మిగిలి ఉన్న పనులకు రూ. 1771.44 కోట్లు, 960 మెగావాట్ల విద్యుత్ కేంద్రం పనులకు రూ.3216.11కోట్ల అంచనా విలువతో జల వనరుల శాఖ టెండర్లను ఆహ్వానించింది. గడువులోగా మేఘా సంస్థ ఒక్కటే టెండరుకు సంబంధించిన అసలు డాక్యుమెంట్లను, బ్యాంకు గ్యారెంటీ పత్రాలను సమర్పించింది. గతంలో ఈ రెండు పనులను నవయుగ వేర్వేరుగా చేపట్టింది.
ప్రభుత్వ మారక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి వారి నివేదిక మేరకు ప్రభుత్వం నవయుగతో కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేసుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా రెండు పనులనూ కలిపి జలవనరుల శాఖ టెండర్లను ఆహ్వానించింది. రివర్స్ టెండర్ల ప్రక్రియలో బిడ్లను ఆహ్వానించింది. ఈ పనులకు గుత్తేదారు సంస్థలు బిడ్లు దాఖలు చేసేందుకు శుక్రవారం తుది గడువు. శనివారం సాయంత్రం ఐదింటిలోపు టెండరు దాఖలుకు సంబందించిన అసలు డాక్యుమెంట్లు, బ్యాంకు గ్యారెంటీ పత్రాలును పోలవరం అధికారుల సమర్పించాలి. శనివారం సాయంత్రంతో గడువు ముగియగా మేఘా ఇంజనీరింగ్ కంపెనీ ఒక్కటే వీటిని సమర్పించింది. ఈ విషయాన్ని జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్ ధ్రువీకరించారు.
కె.వి.కె శాస్త్రవేత్తల సారథ్యంలో.. ఆదాయ బాటలో
బాలంవారి పల్లి రైతులు ...
అంతర పంటల సాగు తో మూడింతలైనా రైతుల ఆదాయం...
-----
ఒకవైపు కరువు ..మరొకవైపు ధరల పతనం తో ఇబ్బందులు పడుతున్న రైతులను ... అంతర పంటల సాగు లాభాల్లోకి తీసుకెళ్ళింది.... కలికిరి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు ప్రోత్సాహంతో మిశ్రమ పంటల సాగును చేపట్టి రైతులు లాభాల బాటలో పయనిస్తున్నారు...
చిత్తూరు జిల్లా మామిడి తోటల పెంపకానికి పెట్టింది పేరు. జిల్లాలో 90 వేల హెక్టార్లలో విస్తారంగా వివిధ రకాల మామిడి ని ఇక్కడి రైతులు సాగుచేస్తున్నారు. మామిడి పంట సాధారణంగా ఏడాదికి ఒక్కసారి మాత్రమే కాపు వచ్చి ఫలాలను ఇస్తుంది . అంతవరకు రైతులు పంట దిగుబడి కోసం ఎదురు చూడాల్సిందే . అయితే ఒక్కొక్కసారి కరువు ఛాయలతో తీవ్ర వర్షాభావం నెలకొనడం ధరలు పతనం కావడం వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో పూత పిందెలు రాలిపోయి మామిడి దిగుబడి పూర్తిగా తగ్గిపోవడంతో రైతులు నష్ట పోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో మామిడి రైతులను ఆదుకోవాలని ఉద్దేశంతో కలికిరి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు పీలేరు మండలం బాలం వారి పల్లె రైతులను నాలుగేళ్ల కిందట దత్తత తీసుకున్నారు. రైతులు అభివృద్ధికి ఏమి చేయాలన్న విషయాలపై పలుమార్లు గ్రామంలోని రైతులతో సమావేశాలు ఏర్పాటు చేశారు. ఏడాదికోమారు దిగుబడి వచ్చే మామిడితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని శాస్త్రవేత్తలకు రైతులు తెలియజేశారు. దీనిపై స్పందించిన కె.వి.కె శాస్త్రవేత్తలు మామిడి తోటల్లో అంతర పంటలు సాగుకు రైతులను సమాయత్తం చేశారు. ఒక పంటలు నమ్ముకోకుండా మామిడి లో నాలుగు రకాల మిశ్రమ పంటల సాగు చేయడం వలన కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించారు. రైతులు అంగీకరించడంతో నీటి సౌకర్యం ఉన్న మామిడి తోటల్లో అంతర పంటగా టమాటా గోరుచిక్కుడు, బీర ,బెండ, వంగ, వేరుశెనగ ,చిక్కుడు ,ఆకుకూరలు సాగును చేపట్టారు .ఈ పంటలకు అవసరమైన విత్తనాలను కె.వి.కి ఉచితంగా అందజేసింది. శాస్త్రవేత్తల సలహాలు సూచనలతో అంతర పంటలు సాగు చేసిన రైతులు మంచి లాభాలు ఆర్జించారు. మామిడి తోటలు సైతం సారవంతమైన దిగుబడులు గణనీయంగా పెరిగి ఆదాయం మూడింతలు అయింది.
* అంతర పంటలు సాగు లేనప్పుడు రెండు ఎకరాల మామిడితోట కు రూ 40 నుంచి 50 వేల మధ్య ఏడాదికి ఆదాయం వచ్చేది. ప్రస్తుతం అదే భూమిలో నాలుగు ఎకరాల అంతర పంటల సాగు , మామిడి తోట తో కలిపి
రూ 2 లక్షల వరకు ఆదాయం వచ్చింది. మ
మామిడి తోట మాత్రమే ఉన్నప్పుడు ఒక హెక్టారుకు పది టన్నుల దిగుబడి వచ్చేది. అంతర పంటలు సాగుతో 12 టన్నుల వరకు దిగుబడి వచ్చింది.
మామిడిలో అంతర పంటల సాగుకు చెట్ల మధ్య డ్రిప్పు పైపులు అదనంగా ఏర్పాటు చేసుకోవాలి. సమయానుకూలంగా మార్కెట్ కు అనుగుణంగా పంటల మార్పిడి చేస్తూ అంతర పంటల సాగు చేసుకోవాలి. మిశ్రమ పంటల వల్ల ఏడాది పొడవునా రైతులకు ఆదాయం లభిస్తుంది . మిశ్రమ పంటల సాగు ప్రోత్సాహానికి కె.వి.కె వివిధ రకాల కూరగాయల విత్తనాలు రైతులకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది .
మామిడి కోత పూర్తయిన తర్వాత వర్షాకాలం ప్రారంభంలో అంతర పంటలు విత్తుకోవచ్చు . మామిడి పూత కు వచ్చే సమయానికి అంతర పంటల కాలం పూర్తి అవుతుంది .
మళ్ళీ మామిడి కాయ దశలో ఉన్నప్పుడు కూరగాయల పంటలను విత్తుకోవచ్చు .
వేసవికాలంలో మామిడి చెట్ల మధ్య టమాట సాగు ఎంతో అనుకూలంగా ఉంటుంది. అది కూడా ఆశించిన స్థాయిలో వస్తాయి..
కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తల వాయిస్ రైతుల ఉంది...
మొదటిది
డాక్టర్ ఎం.రెడ్డికుమార్ కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త కలికిరి ...
నాగిరెడ్డి ఉద్యాన శాస్త్రవేత్త, కృషి విజ్ఞాన కేంద్రం, కలికిరి
కె మహేష్ యువ రైతు బాలం వారిపల్లి పీలేరు మండలం
వి .చంద్రయ్య రైతు బాల 0వారి పల్లె
Body:అంతర పంటలు సాగు రైతుకు లాభదాయకం
Conclusion:అంతర పంటలు సాగు రైతులకు లాభదాయకంగా మారింది చిత్తూరు జిల్లా పీలేరు మండలం బాల వారి పాలెం దత్తత తీసుకున్న కలికిరి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు అంతర పంటల సాగు తో రైతులను లాభాల బాటలో కి తీసుకెళ్లారు