వర్షపు నీటిని ఒడిసిపట్టుకునే లక్ష్యంతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు తగిన కార్యాచరణ చేపట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ఆదేశించారు. జలశక్తి అభియాన్ కార్యక్రమంలో భాగంగా 'క్యాచ్ ది రెయిన్' అన్న అంశాన్ని దిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోదీ లాంఛనగా ప్రారంభించారు. ప్రపంచ జల దినోత్సవాన్ని పురస్కరించుకుని భూగర్భ జలమట్టాన్ని పెంచేందుకు 'క్యాచ్ ది రెయిన్' పేరుతో దేశవ్యాప్తంగా చేపట్టనున్న భారీ ప్రచార కార్యక్రమాన్ని ప్రధాన మంత్రి మొదలు పెట్టారు.
అమరావతి నుంచి రాష్ట్ర సీఎస్ ఆదిత్యనాథ్‌దాస్ హాజరయ్యారు. రాష్ట్రంలో జలశక్తి అభియాన్ ద్వారా చేపట్టిన ప్రాజెక్టులను సీఎస్ వివరించారు. వర్షపు నీటిని పూర్తిగా వినియోగించుకోవడంలో ప్రజలందరినీ భాగస్వామ్యం చేయాల్సిదిగా ప్రధాని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. అన్ని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోనూ ఈ కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు.. 'క్యాచ్ ది రెయిన్' పేరిట నిర్వహించే ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఈనెల 22 నుంచి నవంబరు 30వ తేదీ వరకూ ఉద్యమస్థాయిలో నిర్వహించాల్సిందిగా చెప్పారు.
ఇదీ చదవండి: