ETV Bharat / city

పుట్టిన బిడ్డతో పాటు ఒక మొక్క...ఆస్పతుల్లో వినూత్న విధానం! - జగ్గయ్యపేటలో మొక్క- బిడ్డ పథకం వార్తలు

పిల్లలు పెద్దవాళ్లు అయితే చెట్టంత బిడ్డలున్నారని అంటూ ఉంటారు. ఇదే నానుడిని నిజం చేస్తున్నారు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు. పర్యావరణాన్ని కాపాడటం సహా మొక్కల విలువను ప్రజలకు తెలిపేందుకు... 'మొక్క- బిడ్డ'  పేరుతో వినూత్న కార్యక్రమం చేపట్టారు. బాలింతలకు ఆసుపత్రుల్లోనే మొక్కలను కానుకగా అందిస్తున్నారు.

plant-baby-scheme-in-jaggaiahpeta-in-krishna-district

author img

By

Published : Dec 12, 2019, 9:01 AM IST

ఆసుపత్రిలో బాలింతలకు మొక్కలు ఇస్తున్నారేంటని ఆశ్చర్యంగా ఉంది కదూ..? కృష్ణా జిల్లా జగ్గయ్యపేట ప్రభుత్వం ఆసుపత్రిలో కొన్నేళ్లుగా స్వచ్ఛంద సంస్థలు చేపట్టిన వినూత్న కార్యక్రమం ఇది. మొక్కలు, కన్నబిడ్డలతో సమానమంటూ.. గంగాదేవి సేవాసమితి, కాకతీయ సేవాసమితి సభ్యులు అవగాహన కల్పిస్తూ హరిత ఉద్యమాన్ని చేపట్టారు. ఇప్పటి వరకూ వెయ్యికి పైగా మొక్కలు పంపిణీ చేశారు.

పుట్టిన బిడ్డలేంతో ఆ మొక్కలు కూడా అంతే...!

పుట్టిన బిడ్డలతో పాటే మొక్కలనూ..!

పర్యావరణహితం కోసం మూడేళ్ల క్రితం వచ్చిన ఆలోచన కొత్త సాంప్రదాయానికి నాంది పలికింది. ఆస్పత్రుల్లో పురుడు పోసుకున్న తల్లులకు స్వచ్ఛంద సంస్థ సభ్యులు మొక్కలు అందించడం ప్రారంభించారు. పుట్టిన బిడ్డలతోపాటే ఆ మొక్కలను కంటికి రెప్పలా పెంచాలని సూచించారు. తొలుత ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రమే మొక్కలు అందించగా... తర్వాతి కాలంలో ప్రైవేట్ ఆసుపత్రులకూ విస్తరించారు. మొక్కలు తీసుకున్న వారి వివరాలు నమోదు చేసుకుని, వాటి సంరక్షణ బాధ్యత సైతం పరిశీలిస్తున్నారు. చాలాచోట్ల పిల్లలతో పాటే మొక్కలు పెరగటం సంతోషంగా ఉందని సేవాసంస్థల ప్రతినిధులు చెబుతున్నారు.

ఆసుపత్రుల్లో మొక్కలు అందుకోవడం పట్ల బాలింతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ బిడ్డలతోపాటే సమానంగా పెంచుతామని హామీ ఇస్తున్నారు. కాలుష్యాన్ని పచ్చదనం ద్వారా తరిమి కొడతామంటున్నారు. మొక్కలు పెంచి పర్యావరణాన్ని కాపాడుతున్న స్వచ్ఛంద సంస్థలపై పర్యావరణవేత్తలు ప్రశంసలు కురుపిస్తున్నారు.

ఇదీ చదవండి : వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు విందుకు రాజ్‌నాథ్‌సింగ్‌

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.