అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ హైకోర్టులో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ ప్రతినిధులు ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. ఘటనకు కారకులైన నిందితులు అదే ఠాణాలో సీఐ, కానిస్టేబుల్‌గా పని చేస్తున్నందున... నిష్పాక్షిక విచారణకు విఘాతం కలిగే అవకాశం ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు. నిందితులకు రాజకీయ పెద్దల అండ ఉన్నందున.. దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉందన్నారు. సెల్ఫీ వీడియోలో సలాం వాంగ్మూలాన్ని అనుసరించి సెక్షన్ 302 కింద కేసు నమోదు చేయాల్సి ఉండగా.... పక్షపాతంతో సెక్షన్ 306 కింద కేసు నమోదు చేశారని ఆరోపించారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం మధ్య పంచాయతీ పోరు