రాష్ట్రంలోని పాఠశాలలు పునః ప్రారంభించడానికి, పదో తరగతి పరీక్షలు నిర్వహించడానికి ముందు ఉపాధ్యాయులందరికీ కొవిడ్ టీకాలు వేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హై కోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఉపాధ్యాయుడు వై.ఉమాశంకర్ పిటిషన్ దాఖలు చేశారు.
'ఆ నిర్ణయం చట్ట విరుద్ధమని ప్రకటించండి'
ఉపాధ్యాయులకు వ్యాక్సిన్ ఇవ్వకుండా జూన్ 1 నుంచి పాఠశాలలు ప్రారంభించడానికి, జూన్ 7న పదో తరగతి పరీక్షలు నిర్వహించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడాన్ని చట్ట విరుద్ధమైందిగా ప్రకటించాలని కోరారు.
వారంతా ప్రతివాదులే..
ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, కొవిడ్ నిర్వహణ, వ్యాక్సిన్ విభాగం ముఖ్య కార్యదర్శి, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఏకే సింఘాల్, పాఠశాల విద్యాశాఖ ముఖ్ యకార్యదర్శి, పాఠశాల విద్య కమిషనర్‌ను వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ డి.రమేశ్, జస్టిస్ కె.సురేశ్ రెడ్డితో కూడిన ధర్మాసనం నేడు ఈ వ్యాజ్యంపై విచారణ జరపనుంది.
ఇదీ చదవండి: