తెలంగాణలోని భద్రాద్రి జిల్లా ఇల్లందు పట్టణంలో.. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నానికి చెందిన సంతోష్ రెడ్డి.. గాంధీ వేషంతో పొట్ట నింపుకొంటున్నాడు. సిల్వర్ పెయింట్‌ను ఒంటికి పూసుకుని భగభగ మండే ఎండలో భిక్షాటన చేస్తూ భార్య, కూతుళ్లను పోషించుకుంటున్నాడు. ఉపాధి కోసం 10 సంవత్సరాల క్రితం జిల్లాకు వచ్చిన తనకు.. ప్రస్తుతం ఏ దారీ లేక.. మహాత్ముడి వేషంతో బతుకుదెరువు కొసాగిస్తున్నట్లు తెలిపాడు.
"కరోనా సంక్షోభానికి ముందు ఓ హోటల్లో పని చేసి కుటుంబాన్ని పోషించుకునేవాడిని. లాక్డౌన్లో ఉపాధి కోల్పోయి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాను. దురదృష్టవశాత్తు.. ప్రమాదంలో కాలికి గాయమైంది. చేసేదేమీ లేక.. గాంధీ వేషధారణతో భిక్షాటన చేస్తున్నాను. ఆ వచ్చే డబ్బుతో పూట గడుస్తోంది" - సంతోష్ రెడ్డి
ఇవీ చదవండి: