ETV Bharat / city

ప్రభుత్వ నిర్ణయంపై ప్రజాగ్రహం... ఊరూరా నిరసన స్వరం - ఏపీలో రాజధాని వివాదం

మూడు రాజధానుల ప్రతిపాదనపై కృష్ణా, గుంటూరు, తూర్పు గోదావరి జిల్లాలో గురువారం ఆందోళనలు కొనసాగాయి. వైకాపా సర్కార్ వైఖరిని నిరసిస్తూ ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. ప్రభుత్వం వెనక్కు తగ్గకపోతే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని ప్రజలు హెచ్చరించారు.

peoples protest against government decision on capital
ప్రజల నిరసనలు
author img

By

Published : Dec 26, 2019, 11:59 PM IST

ప్రభుత్వ నిర్ణయంపై ప్రజాగ్రహం... ఊరూరా నిరసన స్వరం

మూడు రాజధానుల మాటపై గుంటూరు జిల్లా మేడికొండూరులోని ప్రధాన రహదారిపై రైతులు ధర్నా చేశారు. ఒకే రాష్ట్రం...ఒకే రాజధాని ఉండాలంటూ నినాదాలు చేశారు. ప్రాణాలైనా ఇచ్చి అమరావతిని కాపాడుకుంటామని స్పష్టం చేశారు.

అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ తుళ్లూరులో వరుసగా 9వ రోజు నిరసనలు మిన్నంటాయి. వందలాది మంది రైతులు, కూలీలు, మహిళలు ధర్నాలో పాల్గొని తమ నిరసన ప్రకటించారు. తుళ్లూరుతో పాటు చుట్టు పక్కల గ్రామాల నుంచి పెద్దసంఖ్యలో రైతులు, మహిళలు తరలిరావటంతో ధర్నా శిబిరం కిటకిటలాడింది. క్రిస్మస్ వేడుకలను సైతం రహదారిపైనే చేపట్టారు. ఏసుక్రీస్తు ప్రభువు...... ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మనసు మార్చాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తమ జీవితాల్లో వెలుగులు నింపాలంటూ కాగడాలు, కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన నిర్వహించారు.

స్పదించకుంటే ఉద్ధృతం

గుంటూరు జిల్లా పెదనందిపాడులో రాజధాని రైతులకు మద్దతుగా తెదేపా నాయకులు, కార్యకర్తలు ధర్నా చేశారు. గుంటూరు పర్చూరు రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వం అమరావతి విషయంలో సానుకూలంగా స్పందించకపోతే పోరాటాలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

నరసరావుపేటలో తెదేపా ఆధ్వర్యంలో అన్ని వామపక్షాలు కలసి నూతన అఖిలపక్షం ఏర్పాటు చేశారు. రాజధాని అమరావతి మార్పును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. అమరావతి రైతులకు పూర్తి మద్దతు ప్రకటించారు. పూర్తి స్థాయి రాజధాని అమరావతి అని ప్రకటించేంత వరకూ జేఏసీ పోరు ఆగదని స్పష్టం చేశారు. రాజధాని రైతులకు తెదేపా అండగా ఉంటుందని పార్టీ నాయకుడు వేగేశ్న నరేంద్ర వర్మ బాపట్లలో తెలిపారు. మూడు రాజధానుల నిర్ణయం సరైంది కాదని అన్నారు. ప్రజల అభీష్టం మేరకే ప్రభుత్వాలు నడుచుకోవాలని హితవు పలికారు.

అమరావతే ముద్దు

రాజధానిగా అమరావతినే కొనసాగించాలని... ఏపీ ఎమ్మార్పీఎస్ తెలుగు రాష్ట్రాల అధ్యక్షులు పేరు పోగు వెంకటేశ్వరరావు విజయవాడలో డిమాండ్ చేశారు. మంత్రి బొత్స సత్యనారాయణలాంటి పాతతరం నాయకుల ఆలోచనలు రాష్ట్రానికి నష్టం కలిగిస్తాయన్నారు. అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మించాలని నూజివీడు నియోజకవర్గ అఖిలపక్షం రౌండ్​ టేబుల్ సమావేశం తీర్మానించింది. కృష్ణా జిల్లా నూజివీడులో ఈ సమావేశం జరిగింది. రాజధాని మార్పు దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాంతాల వారిగా విభజించి పాలించడం కుట్రపూరితమని పేర్కొన్నారు.

కాగడాలతో నిరసన

రాష్ట్ర రాజధానిని మూడు ముక్కలు చేయొద్దంటూ తూర్పు గోదావరి జిల్లా పి. గన్నవరంలో తెదేపా శ్రేణులు కాగడాల ప్రదర్శన నిర్వహించాయి. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు నియోజకవర్గ ఎమ్మెల్యే చిట్టి బాబుని కలసి వినతి పత్రం అందజేశారు.

ఇదీ చదవండి:ఎమ్మెల్యేల ప్రకటనతో... మందడంలో ఉద్రిక్త పరిస్థితులు

Intro:Ap_gnt_62_26_rajadhani_kosam_rastha_roko_avb_AP10034_Vo

Contributor : k. vara prasad ( prathipadu), guntur

Anchor : రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని కోరుతూ తేదేపా నాయకులు , కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం పాలనలో పూర్తిగా విఫలమైందని... దాన్ని కప్పిపుచ్చుకోవడంతో రాజధాని పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టారని నాయకులు ఆరోపించారు.

గుంటూరు జిల్లా పెదనందిపాడులో రాజధాని రైతులకు మద్దతుగా తెదేపా నాయకులు, కార్యకర్తలు ధర్నా చేశారు. గుంటూరు పర్చూరు రహదారి పై రాస్తారోకో జరిపారు. ముఖ్యమంత్రి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటే...వాటికి అనుగుణంగా మంత్రులు తలలు ఊపుతున్నారని ఎద్దేవా చేశారు. రాజధాని ప్రాంతంలోని మంత్రులు, ఎమ్మెల్యే లు రాజధాని విషయంలో ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. విశాఖలో వైకాపా వారు భూములు కొనుగోలు చేసి కావాలనే రాజధాని అక్కడికి మార్చాలని చూస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం అమరావతి విషయంలో సానుకూలంగా స్పందించకపోతే పోరాటాలు ఉధృతరం చేస్తామని హెచ్చరించారు.

బైట్లు:
1. సుబ్బారావు తెదేపా మండల అధ్యక్షుడు
2. తెదేపా నాయకుడు
3. తెదేపా నాయకుడు
4. తెదేపా నాయకుడు

Body:end

Conclusion:end
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.