గుంటూరు జిల్లా అమరావతి మండలంలోని పలు గ్రామాల్లో పింఛన్లు తొలగించారు. చావపాడు, యండ్రాయి చర్మకారులు, డప్పు కళాకారుల పింఛన్లు తీసేశారు అధికారులు. మండల అధికారులను కలిసి మెురపెట్టుకున్న ఫలితం లేకపోవటంతో... డీఆర్డీఏ పీడీకి బాధితులు ఫిర్యాదు చేశారు. కారణం లేకుండా తొలగింపుపై కిందిస్థాయి సిబ్బందిపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పీడీ యుగంధర్ విచారణ చేపట్టి న్యాయం చేస్తానని బాధితులకు హామీ ఇచ్చారు.
ఇవీ చదవండి: నగదు కావాలంటే... నడక సాగాల్సిందే!