ఇసుక మైనింగ్ విధానం, వర్షాకాలంలో చేపట్టే కార్యాచరణపై మంత్రి పెద్దిరెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ అంశంపై జిల్లాల్లో కొత్తగా నియమితులైన శాండ్ ఆఫీసర్లతో చర్చించిన మంత్రి... వర్షాకాలం కోసం 60 లక్షల టన్నుల ఇసుక నిల్వ చేయాలని ఆదేశించారు.
ఇప్పటివరకు 30 లక్షల టన్నుల ఇసుక నిల్వ చేశామని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. ఇప్పటివరకు మొత్తం 24 లక్షల టన్నుల ఇసుక డోర్ డెలివరీ చేశామన్న ఆయన.. ఇసుక రవాణాకు 13,620 వాహనాలు జీపీఎస్‌తో అనుసంధానం చేశామని వెల్లడించారు.
మార్చి 23 వరకు వంద రీచ్‌లు, 43 డెస్టినేషన్ పాయింట్లు, 68 పట్టాభూముల్లో మైనింగ్ చేశామని మంత్రి పేర్కొన్నారు. మొత్తం 246 స్టాక్ యార్డులు, శాండ్ డిపోల్లో కార్యకలాపాలు జరుగుతున్నట్లు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: