ETV Bharat / city

'రూ.226 కోట్ల బకాయిలు చెల్లిస్తేనే... కొత్త రుణాలు'

రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయ సహకార అభివృద్ధి సంస్థ షాక్ ఇచ్చింది. గడువు మీరిన బకాయిల్ని చెల్లిస్తేనే కొత్త రుణం ప్రతిపాదనను పరిగణలోకి తీసుకుంటామని తేల్చి చెప్పింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆ సంస్థ ఎండీ సందీప్​కుమార్ నాయక్ లేఖ రాశారు.

ncdc letter to ap
ncdc letter to ap
author img

By

Published : Apr 26, 2020, 4:15 AM IST

గడువు మీరిన బకాయిల్ని చెల్లిస్తేనే... కొత్త రుణాల చెల్లింపు అంశాన్ని పరిగణలోకి తీసుకుంటామని జాతీయ సహకార అభివృద్ధి సంస్థ(ఎన్​సీడీసీ) రాష్ట్ర ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. ఆంధ్రప్రదేశ్​తో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న సుహృద్భావ సంబంధాల దృష్ట్యా ఏప్రిల్ 22 నాటికి తమకు చెల్లించాల్సిన రూ.225.89 కోట్లను వెంటనే జమ చేయాలంటూ ఎన్​సీడీసీ ఎండీ సందీప్​కుమార్ నాయక్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి లేఖ రాశారు.

రాష్ట్రంలో జొన్న, మొక్కజొన్న, పసుపు పంటల సేకరణకు రూ.2వేల కోట్లను ఏడాది కాలానికి రుణంగా ఇవ్వాలని ఏప్రిల్ 8న ఎన్​సీడీసీకి మార్క్​ఫెడ్ లేఖ రాసింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. అంతకుముందు ఆంధ్రప్రదేశ్​లోని సహకార చక్కెర కర్మాగారాలకు ఎన్​సీడీసీ 2019 మార్చి, ఏప్రిల్ నెలల్లో 200 కోట్ల రూపాయలను మూలధన రుణంగా విడుదల చేసింది. తొలి విడత రుణాన్ని ఈ ఏడాది ఫిబ్రవరి నెలాఖరులోగా, రెండో విడత రుణాన్ని మార్చి నెలాఖరులోగా వడ్డీతో సహా తిరిగివ్వాలి. మొత్తం వడ్డీతో కలిపి రూ.225.89 కోట్లు చెల్లించాలి. గడువు దాటినా... ఏప్రిల్ 22 వరకు ఈ మొత్తం చెల్లించలేదని.. ఆ ప్రక్రియ పూర్తయితేనే కొత్త రుణం ప్రతిపాదనను పరిగణలోకి తీసుకుంటామని సందీప్​కుమార్ లేఖలో పేర్కొన్నారు.

ఇదీ చదవండి

నెల రోజుల్లో 100 రెట్లు పెరిగిన పాజిటివ్ కేసులు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.