గ్రామపంచాయతీలు యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదిగేలా జనసేన కృషి చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ తెలిపారు. మూడో విడతలో జనసేన దాదాపు 23శాతం ఓటింగ్ శాతం సాధించి 270కి పైగా పంచాయతీల్లో సర్పంచ్, ఉప సర్పంచ్ పదవులు దక్కించుకుందని చెప్పారు. ఇది మార్పునకు సంకేతమని అభిప్రాయపడ్డారు. మైసూరువారిపల్లి పంచాయతీ సర్పంచ్‌గా దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికుని భార్య సంయుక్త గెలుపొందడం చాలా ఆనందాన్ని కలిగించిందిన్నారు. అధికార పార్టీ ప్రలోభాలకు ఎదురొడ్డి నిలిచిన యువత, ఆడపడుచులు... నాలుగో విడతలోనూ అదే స్ఫూర్తిని ప్రదర్శించాలని కోరారు.
కుప్పం నియోజకవర్గంలో పంచాయతీలు, వార్డులను జనసైనికులు గెలవడం మార్పునకు సంకేతమన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు మెంబర్లుగా జనసైనికుల గెలుపొందారన్నారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలు చూస్తే మార్పు వస్తుందనే నమ్మకం చాలా బలంగా కలిగిందని తెలిపారు.
ఇదీ చూడండి. స్టేషన్ బెయిల్‌పై చింతమనేని ప్రభాకర్ విడుదల