PAWAN ON NAME CHANGE : ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును మార్పు చేసి.. రాష్ట్ర ప్రభుత్వం ఏమి సాధించాలనుకుంటుందో చెప్పాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ బదులుగా వైఎస్సార్ అని పెడితే విశ్వ విద్యాలయంలోనూ, రాష్ట్రంలోనూ వసతులు మెరుగవుతాయా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో వైద్య వసతులు ప్రమాణాలకు తగ్గట్టుగా లేవని విమర్శించారు. ఏ ప్రభుత్వ ఆసుపత్రిలోనూ తగినన్ని పడకలు, సిబ్బంది అందుబాటులో లేరని మండిపడ్డారు. మెరుగుపరచాల్సిన మౌలిక వసతులను వదిలిపెట్టి విశ్వ విద్యాలయం పేరు మార్చడంలో అర్థం లేదని మండిపడ్డారు.
ప్రజల దృష్టిని పక్కదోవ పట్టించేందుకే.. కొత్త వివాదాలు సృష్టించే ప్రయత్నమే వైకాపా చేస్తున్న పని అని విమర్శించారు. పాలకులు మారినప్పుడల్లా పేర్లు మార్చుకుంటూ వెళ్తే ప్రజలకు ఒరిగేదేమీ ఉండదన్నారు. పేర్లు మార్చాలనుకుంటున్న ప్రభుత్వం.. బ్రిటిషర్ల పేరు ఉన్న విశాఖ కింగ్ జార్జ్ ఆసుపత్రి పేరు ఎందుకు మార్చరని ప్రశ్నించారు. ప్రపంచ ప్రఖ్యాత వైద్య శాస్త్రజ్ఞుల్లో ఒకరైన యల్లాప్రగడ సుబ్బారావు పేరును ఎందుకు పెట్టలేదని నిలదీశారు. ఇంట్లో వాళ్ల పేర్లు ప్రజల ఆస్తులకు పెట్టే ముందు.. ప్రజల కోసం జీవితాలను దారపోసిన మహనీయుల గురించి పాలకులు తెలుసుకోవాలని హితవు పలికారు.
-
పేరు మార్చి సాధించేది ఏమిటి?
— JanaSena Party (@JanaSenaParty) September 21, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
* వివాదాలు సృష్టించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది - JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/IgmExcASLP
">పేరు మార్చి సాధించేది ఏమిటి?
— JanaSena Party (@JanaSenaParty) September 21, 2022
* వివాదాలు సృష్టించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది - JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/IgmExcASLPపేరు మార్చి సాధించేది ఏమిటి?
— JanaSena Party (@JanaSenaParty) September 21, 2022
* వివాదాలు సృష్టించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది - JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/IgmExcASLP
ఇవీ చదవండి: