ETV Bharat / city

రాజధాని అమరావతిలోనే ఉండాలని చినలాజర్‌ పోరాడారు: పవన్‌ - pawan kalyan condolence to amaravathi farmer lazer news

రైతుల పక్షాన పోరాడిన చినలాజర్ చనిపోయారని తెలిసి బాధపడ్డానని జనసేన అధినేత పవన్ అన్నారు. అసైన్డ్ రైతులకు న్యాయం జరగాలని చినలాజర్‌ పోరాటం చేశారని గుర్తు చేశారు.

రాజధాని అమరావతిలోనే ఉండాలని చినలాజర్‌ గట్టిగా పోరాడారు: పవన్‌

author img

By

Published : Oct 10, 2020, 6:08 PM IST

అసైన్డ్ రైతుల సొసైటీ అధ్యక్షుడు పులి చినలాజర్ మృతిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లంకభూములపై పేదలు, దళిత రైతుల గొంతు వినిపించారని లాజర్​ను కొనియాడారు. 2018లో లాజర్ స్వగ్రామం ఉద్దండరాయుపాలెంలో ఉగాది వేడుక జరుపుకొన్న విషయాన్ని పవన్ గుర్తు చేసుకున్నారు.

రాజధాని అమరావతిలోనే ఉండాలని చినలాజర్‌ గట్టిగా పోరాడారని పేర్కొన్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 300 రోజులకు చేరిన ప్రస్తుత ఉద్యమాన్ని రాష్ట్రస్థాయిలో బలంగా చేసి అనుకున్నది సాధించినప్పుడు లాజర్​కు సరైన నివాళి అని పవన్ వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి:

రాజధాని ఉద్యమం: గుండెపోటుతో మరో ఇద్దరు రైతులు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.