ETV Bharat / city

గ్రామాల్లో విప్లవం వస్తేనే రాజకీయాల్లో మార్పు వస్తుంది: పవన్

గ్రామాల్లో విప్లవం వస్తేనే రాజకీయాల్లో మార్పు వస్తుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. తొలి రెండు విడతల్లో జనసేన మద్దతుతో గెలిచిన సర్పంచ్, ఉప సర్పంచ్​లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన పవన్... ఒత్తిళ్లు ఎదురైనా పోరాడి గెలిచినందుకు అభినందనలు తెలిపారు. ప్రజల ఆశలను, ఆకాంక్షలు నెరవేర్చాలని సూచించారు.

Pawan Kalyan Tele Conference
జనసేన అధినేత పవన్ కల్యాణ్
author img

By

Published : Feb 17, 2021, 8:36 PM IST

గ్రామాల్లో విప్లవం వస్తేనే రాజకీయాల్లో మార్పు వస్తుందని జనసేన అధ్యక్షులు పవన్‌ కల్యాణ్ అన్నారు. రాబోయే మార్పునకు ఇప్పుడొస్తున్న ఫలితాలే సంకేతాలని చెప్పారు. ఎక్కడో కూర్చొని శాసించాలని చూసే ముఖ్యమంత్రులు, మంత్రుల వల్లే నిధులున్నా అభివృద్ధికి ఆమడ దూరంలో గ్రామాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. తొలి రెండు విడతల్లో జనసేన మద్దతుతో గెలిచిన సర్పంచ్, ఉప సర్పంచ్​లతో పవన్‌ కల్యాణ్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీల నుంచి ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా పోరాడి గెలిచినందుకు వారికి అభినందనలు తెలిపారు. కృష్ణాజిల్లా కోరుకొల్లులో నిండు గర్భిణీ లీలా కనకదుర్గ పార్టీ మద్దతుతో పోటీ చేసి గెలుపొందటం జాతీయ స్థాయిని ఆకర్షించిందన్నారు. ఎన్నికల బరిలో నిలిచి గెలిచిన అభ్యర్థులు వారివారి అనుభవాలు ఫిర్యాదులు జనసేన అధినేతతో పంచుకున్నారు.

ఇదీ చదవండి:

కొడాలి నాని పిటిషన్​పై తీర్పు రేపటికి వాయిదా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.