రాష్ట్రంలో యురేనియం తవ్వకాలతో అక్కడి ప్రజలు జీవితాలు నాశనమైపోతున్నాయని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ అన్నారు. కడపలో యురేనియం తవ్వకాల పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు జనసేన పొలిట్‌బ్యూరో సభ్యులు, నేతలు పులివెందుల పర్యటనకు వెళ్లనున్నట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. అక్కడి ప్రజలకు న్యాయం జరిగేలా పోరాటం చేస్తామన్నారు.
ఇసుక కొరతపై 18 పాయింట్ల నివేదిక
ఇసుక కొరతపై గవర్నర్‌కు 18 పాయింట్లతో నివేదిక ఇచ్చినట్లు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తెలిపారు. ఎవరైతే స్మగ్లింగ్ చేస్తారో వారిపై గూండా చట్టం, జైలుశిక్ష విధించాలని నివేదికలో పేర్కొన్నట్లు వివరించారు. తాము గవర్నర్ వద్ద ప్రస్తావించిన అంశాలనే నిన్న ప్రభుత్వం ఆమోదించిందన్నారు.
ఇదీ చూడండి: