ETV Bharat / city

మద్యం ఆదాయాన్ని ‘నివర్‌’ పరిహారంగా ఇవ్వండి: పవన్

ఇటీవల వరదల కారణంగా నష్టపోయిన రైతుల విషయంలో.. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ.. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ దీక్షకు దిగారు. మద్యం అమ్మకాల ద్వారా వచ్చే మొత్తం ఆదాయం రూ.16,500 కోట్లను రైతులకు సాయంగా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రైతులకు ఆర్థిక సహాయంపై ఎలాంటి ప్రకటన చేయని ప్రభుత్వ తీరును తప్పుబడుతూ.. హైదరాబాద్ లోని తన నివాసంలో దీక్ష చేశారు.

Pawan Kalyan deeksha in hyderabad
మద్యం ఆదాయాన్ని ‘నివర్‌’ పరిహారంగా ఇవ్వండి: పవన్
author img

By

Published : Dec 7, 2020, 12:11 PM IST

Updated : Dec 8, 2020, 4:38 AM IST

నివర్‌ తుపాను వల్ల నష్టపోయిన రైతులకు ఒక్కొక్కరికి కనీసం రూ.35వేలు చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ దీక్ష చేపట్టారు. పరిహారం విషయంపై నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వానికి ఆయన ఇచ్చిన 48 గంటల గడువు ముగియడంతో సోమవారం నిరసన దీక్ష చేపట్టారు. హైదరాబాద్‌ లోని తన నివాసంలోనే ఆయన ఈ దీక్ష చేశారు. మద్యం అమ్మకాల ద్వారా వచ్చే మొత్తం ఆదాయం రూ.16,500 కోట్లను రైతులకు సాయంగా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

తుపాను వల్ల నష్టపోయిన కృష్ణా, గుంటూరు, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో రైతుల స్థితిగతులను పరిశీలించిన ఆయన పంట నష్టం కింద రూ.35 వేలు, అందులో తక్షణ సాయం కింద రూ.10వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ప్రభుత్వానికి గడువు ఇచ్చిన విషయం తెలిసిందే. జనసేన పార్టీ శ్రేణులు కూడా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నిరసన దీక్షలు చేపట్టాయి. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడుతూ నివర్‌ తుపాను వల్ల ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 17 లక్షలకు పైగా ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందన్నారు. ఈ మధ్య తాను జిల్లాల్లో పర్యటించినప్పుడు రైతుల ఆవేదన చూశానని చెప్పారు. ఇప్పటి వరకు నలుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

జై కిసాన్‌ ఆరంభం
రైతులకు గిట్టుబాటు ధర కాదు, లాభసాటి ధర రావాలనేది జనసేన ప్రయత్నమని, ఇందుకోసం జై కిసాన్‌ అనే కార్యక్రమాన్ని రూపొందిస్తున్నామని పవన్‌కల్యాణ్‌ చెబుతూ ఈ దీక్షతో జై కిసాన్‌కు శ్రీకారం చుట్టినట్లేనని పవన్‌కల్యాణ్‌ చెప్పారు. వ్యవసాయశాస్త్ర వేత్తలు, వ్యవసాయ సంఘాలతో చర్చించి ఒక విధానాన్ని రూపొందిస్తున్నామని చెప్పారు. భూయజమాని నష్టపోకుండా కౌలు రైతులను ఎలా ఆదుకోవాలనే విషయంలో ప్రభుత్వం లోతుగా ఆలోచించి వారి సమస్య పరిష్కరించాలని పవన్‌కల్యాణ్‌ కోరారు.

ఇదీ చదవండి:

తుళ్లూరులో ఉద్రిక్తత.. డీజీపీ వస్తేనే ఆందోళన విరమిస్తామన్న రైతులు

Last Updated : Dec 8, 2020, 4:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.