ETV Bharat / city

అభిమాని ఇంటికి పవన్ కల్యాణ్..రూ. ఐదు లక్షల వైద్యసాయం

author img

By

Published : Mar 9, 2021, 8:37 PM IST

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. కేన్సర్​తో బాధపడుతున్న తన అభిమానిని పరామర్శించి..ఐదు లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించాడు.

pawan kalyan
pawan kalyan
అభిమాని ఇంటికి పవన్ కల్యాణ్... ఐదు లక్షల వైద్యసాయం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన ఔదార్యాన్ని చాటుకున్నారు. కృష్ణా జిల్లా వత్సవాయి మండలం లింగాలలో తన అభిమాని ఇంటికి వెళ్లారు. కేన్సర్​తో బాధపడుతున్న భార్గవ్​ను పరామర్శించారు. వైద్య సాయం కోసం రూ. 5 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. భార్గవ్​కు ధైర్యం చెప్పి.. వెండి గణపతి విగ్రహాన్ని అందించారు. అతని తల్లిదండ్రులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్యం అందిస్తున్న డాక్టర్లతో మాట్లాడారు. ఎన్ఆర్​ఐ దాతల నుంచి సహాయం అందేలా ఏర్పాట్లు చేస్తామని పవన్ హామీ ఇచ్చారు.

మరోవైపు పవన్ రాక సమాచారం అందుకున్న పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీగా చేరుకున్నారు.

ఇదీ చదవండి

ఉక్కుపోరు: 24 గంటలుగా జాతీయ రహదారి దిగ్బంధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.