ETV Bharat / city

అయోధ్య తీర్పు భారతీయుల విజయం : పవన్ - Ayodhya verdict news

సుప్రీంకోర్టు అయోధ్య తీర్పు దేశ ప్రజల విజయమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. తీర్పును ప్రజలు స్వాగతించారన్న ఆయన.. అందుకు ఆసేతు హిమాచల ప్రశాంతతే నిదర్శనమన్నారు. శతాబ్ధాల వివాదానికి ఓ ముగింపు లభించిందని అభిప్రాయపడ్డారు.

అయోధ్య తీర్పు భారతీయుల విజయం : పవన్
author img

By

Published : Nov 9, 2019, 9:53 PM IST

pavan kalyan on ayodhya verdict
అయోధ్య తీర్పుపై పవన్ వ్యాఖ్యలు
అయోధ్య వివాదాస్పద స్థలంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఒకరి విజయం, మరొకరి పరాజయంగా చూడకూడదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. సుప్రీం తీర్పుపై ట్విట్టర్​లో స్పందించిన ఆయన... ఈ తీర్పు భారతీయుల విజయమని పేర్కొన్నారు. అయోధ్య తీర్పును ప్రజలంతా గౌరవించిన తీరే ఇందుకు నిదర్శనమని... ఆసేతు హిమాచలం ప్రశాంతంగా ఉందని, ఇది దేశం విజయమే అని అభిప్రాయపడ్డారు. తీర్పు ఓ సామరస్య పరిష్కారమన్న పవన్.. చాలా ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న వివాదానికి ఒక ముగింపు లభించిందన్నారు. మనిషి పుట్టిన తర్వాతే మతాలు పుట్టాయని, దేశమంటే మట్టి కాదోయ్... దేశమంటే మనుషులోయ్ అన్న గురజాడ మాటలను గుర్తు చేసుకోవాలని పవన్ సూచించారు.

ఇదీ చదవండి :

సుప్రీం తీర్పును ప్రజలందరూ గౌరవించాలి: చంద్రబాబు

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.