వేగంగా దుసుకొచ్చే పశువులు..! వాటిని నియంత్రించేందుకు పోటీపడే యువత.... ఇదంతా చూస్తుంటే తమిళనాడు జల్లికట్టు గుర్తొస్తోంది కదా.! అచ్చం అలాంటి సంప్రదాయ పోటీలే చిత్తూరు జిల్లా ఏ.రంగంపేటలో నిర్వహిస్తారు. ఏటా కనుమ నాడు.... ఇక్కడ పశువుల పండుగ జరపడం ఆనవాయితీగా వస్తోంది.
అందంగా ముస్తాబు
ఉదయాన్నే పశువులను శుభ్రం చేసి అందంగా ముస్తాబు చేస్తారు. కొమ్ములకు....... అభిమాన కథానాయకులు, సినీ, రాజకీయ నాయకుల చిత్రాలపటాలు కడతారు. తర్వాత ఆ పశువులను.. గ్రామంలోని వీధుల్లో వదులుతారు. అప్పటికే గుమిగూడిన ప్రజల మధ్య నుంచి పశువులు వేగంగా దూసుకెళ్తుంటే వాటి కొమ్ములకు కట్టిన పటాలు స్వాధీనం చేసుకునేందుకు గ్రామస్థులు పోటీపడతారు. ఈ క్రమంలో... గాయాలనూ లెక్కచేయకుండా పశువులను లొంగదీసుకునేందుకు ప్రయత్నిస్తారు.
ఇదీ చదవండి : ఇక పాస్పోర్టు పొందడం మరింత సులభం