సెలక్టు కమిటీకి పంపిన పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ చట్టం రద్దు బిల్లులు మనుగడలోనే ఉంటాయి. సెలక్టు కమిటీ అధ్యయనం కొనసాగుతుంది. శాసనసభ ఆమోదించిన మండలి రద్దు తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపుతుంది. దీన్ని ఏపీ శాసన మండలి రద్దు బిల్లుగా పార్లమెంటులో ప్రవేశపెడతారు. ఉభయ సభలు ఆమోదిస్తే రాష్ట్రపతి వద్దకు వెళ్తుంది. రాష్ట్రపతి ఆమోదంతో మండలి రద్దు ప్రక్రియ పూర్తవుతుంది. దీనికి నిర్ణీత సమయమంటూ లేదు.
సెలక్టు కమిటీ సభ్యుల నియామకానికి చర్యలు
పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ చట్టం రద్దు బిల్లులకు సంబంధించి సెలక్టు కమిటీ సభ్యుల నియామకానికి చర్యలు తీసుకోవాలని మండలి కార్యదర్శికి ఛైర్మన్ షరీఫ్ సూచించారు. సభ్యుల పేర్ల సిఫార్సుల కోసం ఆయా పార్టీల ఫ్లోర్‌లీడర్లకు లేఖలు పంపాలని సూచించారు.
ఇదీ చదవండి: శాసన మండలి రద్దుపై చర్చించిన శాసనసభలో ఎప్పుడు ఏం జరిగింది?