ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి.. రాజధాని ఎక్కడుందో తెలియని దిక్కుతోచని స్థితి ఉందని రాజకీయ విశ్లేషకులు, ప్రభుత్వ మాజీసలహాదారు పరకాల ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్దాల తరబడి రాజధాని కోసం అన్వేషణలే తప్ప ప్రభుత్వాలు శాశ్వత పరిష్కారాలు ఆలోచించడం లేదని పేర్కొన్నారు. అమరావతి రాజధాని విషయంలో గత ప్రభుత్వాలు, ప్రస్తుత పాలకుల మధ్య వివాదాలు, రాజధాని కోసం భూములిచ్చిన రైతులు ఆర్తనాదాలు, మూడు రాజధానుల విషయంలో దక్షిణాఫ్రికా సమీక్షలను ప్రస్తావిస్తూ.. "రాజధాని విషాదం - అమరావతి" పేరుతో 60 నిమిషాల ప్రత్యేక డాక్యుమెంటరీని పరకాల ప్రభాకర్ రూపొందించారు.
హైదరాబాద్లోని ఓ ప్రివ్యూ థియేటర్లో ఆ డాక్యుమెంటరీని ప్రభాకర్ విడుదల చేశారు. పలువురు మేథావులు, రాజకీయ ప్రముఖులు, సామాజిక విశ్లేషకులు వీక్షించారు. రాష్ట్ర రాజధాని విషయంలో సమగ్రమైన అధ్యయనం, సరైన పరిష్కారం కోసమే తాను రాజధాని విషాదం డాక్యుమెంటరీని రూపొందించినట్లు పరకాల ప్రభాకర్ స్పష్టం చేశారు. వచ్చే వారంలో ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన వెల్లడించారు.
ఇదీ చదవండి: