రాష్ట్రానికి బలమైన రాజధాని ఉండాలనే ఆనాడు భాజపా, తెదేపాకు మద్దతిచ్చానని పవన్ కల్యాణ్ ఉద్ఘాటించారు. రాజధాని పర్యటనలో భాగంగా తుళ్లూరులో రైతుల దీక్షకు మద్దతిచ్చిన పవన్ మాట్లాడారు. గతంలో ఏ ఉద్యమమూ అమరావతి కోసం జరిగినన్ని రోజులు జరగలేదన్నారు. యూపీఏ తెచ్చిన ఎన్నో విధానాలను ఎన్డీయే కొనసాగించిందని గుర్తుచేశారు. అన్ని ప్రాంతాలు బాగుండాలి, సమగ్రాభివృద్ధి జరగాలనేదే తన అభిమతమని పేర్కొన్నారు. ఎవరు వచ్చినా, రాకున్నా రాజధాని రైతులకు తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. రాష్ట్ర రాజధానిగా అమరావతే ఉంటుందని పునరుద్ఘాటించారు.
ఇవీ చదవండి.. 'భూములు తెదేపాకు ఇవ్వలేదు... ప్రభుత్వానికి ఇచ్చారు'