దిశ చట్టం ద్వారా ఏ మహళకు న్యాయం జరిగిందో హోం మంత్రి సమాధానం చెప్పాలని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ డిమాండ్ చేశారు. ఈ చట్టం ద్వారా ఏ మహిళకూ న్యాయం జరగలేదని స్పష్టం చేశారు.
దిశ చట్టం పేరుతో మహిళలను మోసం చేసిన సీఎం జగన్‌పై చీటింగ్ కేసు నమోదు చేయాలని అన్నారు. అసలు ఉనికిలోనే లేని చట్టాన్ని అమలు చేశామంటూ ఏడాది పాటు వంచించారని దుయ్యబట్టారు. దిశ చట్టం ఉందని నిరూపిస్తే.. రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు.
ఇదీ చదవండి: