మంత్రి పదవుల కోసం దిగజారి వ్యవహరిస్తున్నారని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ ఆరోపించారు. రాష్ట్రంలో 'రూల్ ఆఫ్ లా' అమలుకాకపోవటంతో అరాచకం రాజ్యమేలుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క అవకాశం ఇచ్చినందుకు ఎంతకైనా తెగిస్తామన్నట్లు వైకాపా నేతలు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పెడన అభివృద్ధిని గాలికొదిలేసిన జోగి రమేశ్ రౌడీలా ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇసుక, భూ, మైనింగ్, చెరువులు కబ్జా నుంచి వసూళ్ల వరకూ జోగి రమేశ్ చేయని దందాలు లేవని ఆరోపించారు. జడ్ ప్లస్ భద్రతలో ఉన్న ప్రతిపక్షనేత ఇంటిపైకి కిరాయి రౌడీలతో దాడి చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా కిరాయి గూండాలకు ఎవరూ భయపడరని అన్నారు.
ఇదీ చదవండి: