వైకాపా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఫ్రాంక్లిన్ సంస్థను మళ్లీ రాష్ట్రానికి రప్పించాలని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ డిమాండ్ చేశారు. విశాఖ కబ్జాలో భాగంగానే ఫ్రాంక్లిన్ కంపెనీని జగన్ అండ్ కో తరిమేశారని ఆరోపించారు. వైకాపా రెండేళ్ల పాలనలో ఒక్క పరిశ్రమ కూడా రాలేదని విమర్శించారు.
విశాఖను ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దే క్రమంలో 2018లో తెదేపా ప్రభుత్వం ఫ్రాంక్లిన్ టెంపుల్టన్కు మధురవాడలో 40ఎకరాలు కేటాయించారని పంచుమర్తి అనురాధ గుర్తు చేశారు. ఫ్రాంక్లిన్ కంపెనీలో జగన్ రూ.9 కోట్ల షేర్లు పెట్టుబడి పెట్టలేదా అని నిలదీశారు.
రూ.10 లక్షల కోట్లు పెట్టుబడులున్న సంస్థను పూచిక పుల్లతో తీసేస్తూ.. ఎంపీ మిథున్ రెడ్డి పార్లమెంట్లో అసత్య ఆరోపణలు చేస్తే ఆ సంస్థ ఎందుకుంటుందని అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా కొనసాగి ఉంటే.. గత రెండేళ్లలో రాష్ట్రానికి రూ.5లక్షల కోట్ల పెట్టుబడులతో పాటు 3లక్షలమందికి ఉద్యోగాలు వచ్చేవని పంచుమర్తి అనురాధ అన్నారు.
ఇదీ చదవండి: