ETV Bharat / city

వాయువు కాదు.. ఆయువు - ఆక్సిజన్ తాజా వార్తలు

అత్యవసర పరిస్థితుల్లో ఆక్సిజన్ ప్రాణాలను నిలబెడుతుంది. కొవిడ్ మలి దశ వేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో... వైరస్ బారిన పడుతున్న బాధితులకు ప్రాణవాయువు ఎక్కువ అవసరమవుతోంది.

oxygen
ఆక్సిజన్
author img

By

Published : Apr 28, 2021, 7:04 AM IST

కొవిడ్‌ అత్యవసర చికిత్సలో బాధితులకు ఆక్సిజన్‌ ఇవ్వడం కీలకంగా మారింది. మలిదశలో అధిక సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. శ్వాస పీల్చుకోలేక... అపస్మారక స్థితిలో ఉన్నవారికి కృత్రిమ ప్రాణవాయువు ఇస్తే మృత్యువు నుంచి బయట పడుతున్నారు. సాధారణంగా ఊపిరితిత్తుల్లో నిమ్ము ఉన్నా... గాలి పీల్చుకోలేకపోయినా వారికి ఆక్సిజన్‌ ఇస్తున్నారు. అలాగే.. ఆయాసం తీవ్రంగా ఉన్నవారికి, చిన్న మెదడులో రక్తసరఫరా తగ్గినా, రక్తం గడ్డ కట్టినా ఆక్సిజన్‌ ఇస్తున్నారు. శస్త్రచికిత్స చేసిన మత్తు ప్రభావంలో గాలి పీల్చుకోలేకపోయినా ఆక్సిజన్‌ ఇస్తున్నారు. సాధారణంగా కొన్ని గంటలే ఇచ్చే ఆక్సిజన్‌ను.. కొవిడ్‌ బాధితులకు రోజుల కొద్దీ ఇవ్వాల్సి వస్తోంది.

కొవిడ్‌లో ఎవరికి ఇవ్వాలంటే..

కరోనా తొలిదశలో 50 ఏళ్లు దాటినవారికే ఆక్సిజన్‌ అవసరం అయ్యేది. ఇప్పుడు 25 ఏళ్లవారికీ ఇవ్వాల్సి వస్తోంది. వైరస్‌ సోకిన వారిలో కొందరి ఊపిరితిత్తుల్లో ఉన్న నిమ్ము వల్ల బయట నుంచి స్వీకరించే ప్రాణవాయువు రక్తంలో కలవదు. దీనివల్ల శరీరానికి ఆక్సిజన్‌ సరఫరా తగ్గి.. ఆయాసం, తలనొప్పితో బాధ పడుతున్నారు. గుండె, మెదడు, మూత్రపిండాల్లాంటి కీలక అవయవాలకు ఆక్సిజన్‌ సరఫరా తగినంత అందక.. వాటి పనితీరు దెబ్బతింటోంది. వీరికి ఆక్సిజన్‌ అందించాల్సి వస్తోంది.

ఎలా ఇస్తున్నారు?

పల్స్‌ ఆక్సీమీటరులో రీడింగ్‌ 90% కంటే తక్కువగా ఉంటే ఎక్కువ మోతాదు (హై ఫ్లో)లో ఆక్సిజన్‌ ఇస్తున్నారు. ఇదే సమయంలో రోగుల నుంచి రక్తాన్ని 24 గంటల్లో రెండుసార్లు తీసి, అర్టీరియల్‌ బ్లడ్‌ గ్యాస్‌ (ఏబీజీ) పరీక్ష చేసి, ఆక్సిజన్‌ కొనసాగించాలా.. వద్దా? అన్న విషయం నిర్ధారిస్తారు. ఏబీజీ రిపోర్టుల్లో 80% కంటే ఎక్కువగా ఆక్సిజన్‌ ఉన్నట్లు ఖరారైతే నెమ్మదిగా (రెండు లీటర్ల చొప్పున) తగ్గించుకుంటూ వస్తారు. రోగికి ఆక్సిజన్‌ సరఫరా ఆపినా సొంతంగా శ్వాస తీసుకోగలిగితే ఆక్సిజన్‌ సరఫరాను ఇంకా తగ్గిస్తారు. ఈ స్థితిలో ఉన్న రోగులకు సాధారణంగా 5-7 రోజులపాటు ఆక్సిజన్‌ ఇస్తున్నారు.
* ఒక బల్క్‌ సిలిండర్‌లో 6000 నుంచి 7000 లీటర్ల ఆక్సిజన్‌ ఉంటుంది. నిమిషానికి 15 లీటర్ల చొప్పున ఫ్లో రేటును నిర్ధారిస్తే కొవిడ్‌ బాధితుడికి గంటకు 900 లీటర్ల ఆక్సిజన్‌ అవసరం అవుతుంది.
* పల్స్‌ ఆక్సీమీటరు రీడింగ్‌ 90-94% మధ్య ఉంటే దాదాపు 4 రోజులు నిరంతరం ఆక్సిజన్‌ అందిస్తారు. వీరికీ ఏబీజీ చేసి, ఆక్సిజన్‌ శాతాన్ని గుర్తిస్తూ సరఫరాలో మార్పులు చేస్తారు.
* ఆరు నిమిషాల నడకకు ముందు, తర్వాత ఆక్సీమీటరు రీడింగ్‌లో 4% హెచ్చుతగ్గులు కనిపిస్తే ఆసుపత్రిలో చేరాలని వైద్యులు సూచిస్తున్నారు.

ఆక్సిజన్‌ ఇస్తే ఏమవుతుంది?

సరైన సమయానికి ప్రాణవాయువు ఇవ్వడం వల్ల రక్తంలో తగ్గిన ఆక్సిజన్‌ శాతం పెరుగుతుంది. అవయవాల పనితీరు మెరుగుపడుతుంది. ఊపిరితిత్తుల్లో నిమ్ము ఉన్నా.. పెద్దగా నష్టం చేయదు. దీనివల్ల కొద్దిరోజులకే రోగులు కోలుకుంటున్నారు. ఆక్సిజన్‌తో పాటు స్టెరాయిడ్స్‌, రక్తాన్ని పలుచన చేసే ఇంజక్షన్లు కూడా రోగి ప్రాణాలను నిలబెడుతున్నాయి.

బోర్లా పడుకుంటే మంచిది

బోర్లా పడుకుంటే ఊపిరితిత్తుల్లోకి గాలి ఎక్కువగా వెళ్లి... అవయవాలు బాగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఆక్సిజన్‌ ఇవ్వడంతో పాటు ఈ ప్రక్రియనూ కొనసాగించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆక్సీమీటర్‌లో ఆక్సిజన్‌ స్థాయి 94, అంతకంటే తక్కువకు పడిపోయినప్పుడు, బాధితులను ఆసుపత్రి తరలించేలోగా ఇలా బోర్లా పడుకోబెడితే ప్రమాదం కొంతవరకు తప్పుతుంది.

ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 11 వేల 434 కరోనా కేసులు, 64 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.