గుమ్మడికాయల్లా కనిపిస్తున్నా.. ఇవి వంకాయలే. వీటిలో కొన్ని 3 కిలోలకుపైగా బరువుంటాయి. తెలంగాణలోని జనగామ జిల్లా చిల్పూరు మండలం వెంకటాద్రిపేటకు చెందిన రైతు కేశిరెడ్డి సంపత్‌రెడ్డి కొన్నేళ్లుగా విత్తనాల కోసం ఈ వంకాయలను సాగు చేస్తున్నారు.
యంత్రాల ద్వారా విత్తనాలు తీసి దిల్లీకి, చైనాకు ఎగుమతి చేస్తుంటామని, తమకు కంపెనీలు క్వింటాకు రూ.25 వేల నుంచి రూ.30 వేలు చెల్లిస్తాయన్నారు. ఇవి గులాబీ రకం వంకాయలని, సాధారణంగా పెద్ద పరిమాణంలోనే ఉంటాయని జనగామ జిల్లా ఉద్యానశాఖ అధికారిణి కె.ఆర్.లత తెలిపారు. సాగులో యాజమాన్య విధానాలు పాటించడంతో మరింత భారీగా కాశాయన్నారు.
ఇదీ చదవండి: ఆవాసాలకు అందుబాటులో లేని బడులు