ఒక వ్యవస్థను నెలకొల్పడం కన్నా దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం చాలా గొప్ప విషయమని నందమూరి బాలకృష్ణ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్లోని బసవతారకం ఆసుపత్రికి దేశంలోనే 6వ ఉత్తమ క్యాన్సర్ ఆసుపత్రిగా అవార్డు రావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.
భవిష్యత్‌లో దేశంలోనే అత్యుత్తమంగా బసవతారకం ఆసుపత్రిని తీర్చిదిద్దుతామన్నారు. కరోనా సమయంలోనూ బసవతారకం ఆసుపత్రిలో ఎంతోమంది పేదలకు ఉచిత వైద్యం అందించామని తెలిపారు. సేవా సంకల్పంతో నడుస్తున్న తమ ఆసుపత్రికి అవార్డులు రావడాన్ని... వెన్నుతట్టి ప్రోత్సహించడంగా భావిస్తామని బాలకృష్ణ పేర్కొన్నారు.
తమ వైద్యుల కృషి, సేవానిరతే ఆస్పత్రిని ముందుకు నడుపుతోందన్నారు. ఇక ఏపీ ఆరోగ్య శ్రీ కార్డులు ఉన్నవారికి సైతం బసవతారకంలో చికిత్స అందిస్తున్నట్టు స్పష్టం చేశారు.
ఇదీ చూడండి : లోక్సభలో వైకాపా తీరు.. రైతు ద్రోహమే: చంద్రబాబు