తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఉస్మానియా ఆస్పత్రి పాత భవనానికి తాళాలు వేశారు అధికారులు. వందేళ్ల చరిత్ర కలిగిన ఉస్మానియా ఆస్పత్రి పాత భవనంలో గత పదేళ్లుగా అనేకసార్లు పెచ్చులు ఊడిపడ్డాయి. భవంతి శిథిలావస్థకు చేరిందని వైద్యులు పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. పాత భవనం స్థానంలో కొత్త భవనం నిర్మిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ.. పలు కారణాల వల్ల ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేరలేదు. ఇటీవల వచ్చిన వర్షాలకు భవంతిలో భారీగా నీరు చేరింది.
![osmania-hospital-old-building-locked](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8189013_595_8189013_1595839018290.png)
భవనం పరిస్థితిని నిరసిస్తూ.. వైద్యులు ఆందోళన బాట పట్టారు. వైద్య సిబ్బంది ఆందోళనకు స్పందించిన ప్రభుత్వం ఈ నెల 21న భవనంలోని రోగులను తక్షణమే ఇతర వార్డులకు తరలించి.. పాత భవనానికి తాళాలు వేయమని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఉస్మానియా పాత బిల్డింగ్‌లోని రోగుల తరలింపు పూర్తి అయింది. సోమవారం ఆస్పత్రి ఇంఛార్జి సూపరింటెండెంట్ పాండు నాయక్ ఆధ్వర్యంలో పాత ఆస్పత్రి భవనానికి తాళాలు వేశారు.
ఇదీ చదవండి: ప్రభుత్వానికి వ్యతిరేకంగా భగుమన్న నిరసనలు