48 గంటల్లో ఓటీలు, ఆక్సిజన్ పోర్టులు అందుబాటులోకి తేవాలని తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ లోని ఉస్మానియా జనరల్ ఆసుపత్రి సర్జరీ విభాగ జూనియర్ వైద్యులు సమ్మెకు దిగారు. డిమాండ్ పరిష్కరించకుంటే అత్యవసర సేవలు బహిష్కరిస్తామని హెచ్చరించారు. శస్త్ర చికిత్సలు చేసే పరిస్థితి లేకపోవటంతో జూడాలు సమ్మె నోటీసు ఇచ్చారు.
ప్రభుత్వం, ఉన్నతాధికారుల దృష్టికి చాలా సార్లు ఈ సమస్యలను తీసుకొచ్చామని... కానీ అధికారులు పట్టించుకోవటం లేదని మండిపడుతున్నారు. వసతులను సమకూర్చడంలో ఆస్పత్రి వర్గాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఆరోపించారు.
ఇదీ చదవండి: