ETV Bharat / city

కొండెక్కిన ఉల్లి ధరలు.. వినియోగదారులకు కన్నీళ్లు.. - today onion price

తెలుగు రాష్ట్రాల్లో ఉల్లిగడ్డ సామాన్యులను భయపెడుతోంది. ధర రోజురోజుకూ కొండెక్కుతోంది. సామాన్యులకు కోయకుండానే కంట నీరు తెప్పిస్తోంది. వాసన చూద్దామన్నా... అందనంత ఎత్తుగా  ఆకాశాన్ని తాకుతోంది. ఒకే నెలలో 201 శాతం అదనంగా ధర పెరిగిందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో ఊహించవచ్చు.

తెలుగు రాష్ట్రాల్లో కొండెక్కిన ఉల్లి ధరలు.. వినియోగదారులకు కన్నీళ్లు..
author img

By

Published : Nov 17, 2019, 10:12 AM IST

తెలుగు రాష్ట్రాల్లో ఉల్లిగడ్డల ధర సామాన్యులను కలవర పెడుతోంది. రోజురోజుకి పెరుగుతున్న ధరలు ఇప్పట్లో తగ్గే సూచనలు కనిపించడం లేదు. హైదరాబాద్​ మలక్‌పేట్‌ మార్కెట్‌లో నాణ్యమైన ఉల్లిగడ్డల టోకు ధర క్వింటా 6 వేల రూపాయలకు చేరింది. గత నెలలో గరిష్ఠ ధర 1971 రూపాయలు ఉండేది. ఈ నెలలో ఏకంగా 201 శాతం అదనంగా పెరిగింది. ఇక చిల్లర ధరలను వీధికో తీరుగా అమ్ముతున్నారు.

కిలోకు రూ.80

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలకు మహారాష్ట్ర నుంచి వచ్చే నాణ్యమైన పెద్ద ఉల్లిగడ్డల ధర 60 రూపాయలు పలుకుతోంది. చిన్నగా ఉండి అంతగా నాణ్యత లేని వాటిని కూడా కిలో 30 రూపాయలకు అమ్ముతున్నారు. దేశవ్యాప్తంగా ముఖ్య నగరాల్లో చిల్లర కిలోకు 80 రూపాయలకు చేరిందని జాతీయ ఉద్యాన మండలి తాజా నివేదికలో స్పష్టం చేసింది. ఉల్లి ధరల మంటతో విదేశాల నుంచి లక్ష టన్నుల దిగుమతి చేయడమే గాక వాటి నిల్వకు నాణ్యత ప్రమాణాలను సడలించింది.

ధర పెరిగినా.. డిమాండ్ తగ్గలేదు

ఖరీఫ్‌ సీజన్‌లో సాగుచేసిన ఉల్లి పంట వర్షాలకు దెబ్బతినడం వల్ల 10 లక్షల టన్నుల వరకు దిగుబడి తగ్గిందని అంచనా. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలకు గుజరాత్‌, మహారాష్ట్రల నుంచి ఉల్లి దిగుమతి అవుతోంది. క్వింటా ధర ఆరు వేలకు చేరినా డిమాండ్‌ మాత్రం తగ్గలేదు.

దేశవ్యాప్తంగా ఉల్లిగడ్డల ధరలు

నగరం కిలో ధర
హైదరాబాద్‌ రూ. 60
ముంబయి రూ.80
త్రివేంద్రం రూ.78
అమృతసర్‌ రూ.70
పట్నా రూ.70

TG_HYD_05_17_ONIONS_RATE_INCREASE_PKG_3066407 REPORTER:K.SRINIVAS NOTE:ఫైల్‌ విజువల్స్‌ వాడుకోగలరు. ( )ఉల్లిగడ్డల ధరలు పెరిగిపోతున్నాయి. సామాన్యులను కలవర పెట్టే స్థాయికి వీటి ధరలు చేరుకొన్నాయి. రోజురోజుకి పెరుగుతున్న ధరలు ఇప్పట్లో తగ్గే సూచనలు కనిపించడం లేదు. మలక్‌పేట్‌ మార్కెట్‌లో నాణ్యమైన ఉల్లిగడ్డల టోకు ధర క్వింటా 6వేల రూపాయలకు చేరింది. గత నెలలో గరిష్ఠ ధర 1971 రూపాయలు కాగా ఈ నెలలో ఏకంగా 201 శాతం అదనంగా పెరిగింది. ఇక చిల్లర ధరలను వీధికో తీరుగా అమ్ముతున్నారు....LOOOK V.O:ఉల్లిగడ్డల ధరలు సామాన్యులను కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. కేవలం ఒకే నెలలో 201 శాతం అదనంగా ధర పెరిగిందంటే పరిస్థితి ఏ విధంగా ఊహించవచ్చు. హైదరాబాద్‌కు మహారాష్ట్ర నుంచి వచ్చే నాణ్యమైన పెద్ద ఉల్లిగడ్డల ధర 60 రూపాయలు పలుకుతోంది. చిన్నగా ఉండి అంతగా నాణ్యత లేని వాటిని కూడా కిలో 30రూపాయలకు అమ్ముతున్నారు. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో చిల్లర కిలో కు 80 రూపాయలకు చేరిందని జాతీయ ఉద్యాన మండలి తాజా నివేదికలో స్పష్టం చేసింది. ఉల్లి ధరల మంటతో విదేశాల విదేశాల నుంచి లక్ష టన్నుల దిగుమతికి అనుమతివ్వడమే కాక వాటి నిల్వకు నాణ్యత ప్రమాణాలను సడలించింది. V.O:గత జూన్‌, సెప్టెంబరు మధ్య ఖరీఫ్‌ సీజన్‌లో సాగుచేసిన ఉల్లి పంట వర్షాలకు దెబ్బతినడం వలన 10 లక్షల టన్నుల వరకు దిగుబడి తగ్గిందని అంచనా. తెలంగాణలో ఖరీఫ్‌లో 12 వేల ఎకరాల్లో వేస్తారు. రబీలో 20 వేల ఎకరాల వరకు సాగవుతోంది. గుజరాత్‌, మహారాష్ట్రాల నుంచి తెలంగాణకు ఉల్లిగడ్డలు వస్తున్నాయి. ధర పెరిగినా హైదరాబాద్‌కు ఉల్లిగడ్డలు ఇతర రాష్ట్రాల నుంచి వరదలా వచ్చి పడుడున్నాయి. క్వింటా ధర ఆరు వేలకు చేరినా డిమాండ్‌ మాత్రం తగ్గలేదు. ఇప్పుడు పంట లేనందున ధర పెరిగినట్టు రైతులు చెబుతున్నారు. GFX IN..... దేశవ్యాప్తంగా ఉల్లిగడ్డల ధరలు నగరం కిలో ధర హైదరాబాద్‌ 60 ముంబాయి 80 త్రివేంద్రం 78 అమృతసర్‌ 70 పాట్నా 70 GFX OUT.... OVER.....
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.