తెలంగాణ రాష్ట్రం వనపర్తిలో గాంధీనగర్‌కు చెందిన రవి నాయుడు ఈ నెల ఏడున తన భార్య జయశ్రీ ప్రసవం కోసం వనపర్తి మల్టీ స్పెషాలిటీ తీసుకొచ్చాడు. అదేరోజు జయశ్రీ ఆస్పత్రిలోనే ఆడబిడ్డకు జన్మనిచ్చింది. మరుసటి రోజు పసికందు అనారోగ్యంతో మృతిచెందని చెప్పినట్లు రవి తెలిపారు.
తన బిడ్డకు కాలం చెల్లిన మందులు ఇవ్వడంతోనే మరణించిందని తండ్రి ఆరోపించారు. బంధువులతో కలిసి ఆస్పత్రి ఎదుట ధర్నాకు దిగారు. దిగివచ్చిన యాజమాన్యం.. తాము కాలం చెల్లిన మందులు ఇవ్వడం వాస్తవమేనని.. దానివలన ప్రాణాపాయం జరగదని సమర్థించుకునే ప్రయత్నం చేసింది. తమకు న్యాయం జరిగే వరకు కదిలేది లేదని బాధితులు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: