ETV Bharat / city

విద్యార్థుల చదువులపై ఇంకా వీడని కరోనా ప్రభావం - విద్యా వ్యవస్థపై కరోనా ప్రభావం

కొవిడ్‌ కోరల్లో చిక్కుకున్న విద్యారంగం ఇంకా బయటపడలేదు. దీంతో.. బడికి బాల్యానికి అంతరం పెరుగుతోంది. అక్షరాస్యతపైనా ప్రతికూల ప్రభావం చూపుతోంది. ప్రపంచవ్యాప్తంగా లక్షల్లో చిన్నారులకు చదువులకు దూరం అవుతున్నారు. బడి మూతపడటంతో ఇంటికే పరిమితమైన పిల్లల్లో.. మళ్లీ బడి బాట ఎంత మంది పడతారన్నది ప్రశ్నార్థకమే. ఈ నేపథ్యంలో.. ఆఫ్రికా, ఆసియా దేశాల్లో విద్యా రంగం పై పడే దుష్పప్రభావాలపై పలు అంతర్జాతీయ సంస్థలు వెల్లడిస్తున్న నిజాలు ఆందోళనలు కలిగిస్తున్నాయి.

విద్యార్థుల చదువులపై ఇంకా వీడని కరోనా ప్రభావం

author img

By

Published : Apr 8, 2021, 8:41 AM IST

విద్యార్థుల చదువులపై ఇంకా వీడని కరోనా ప్రభావం

అన్నిరంగాలతో పాటు కరోనా మహమ్మారి విద్యారంగాన్ని కుదిపివేసింది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభమై గాడిలో పడుతున్నప్పటికీ.. విద్యా రంగంలో అనిశ్చితి కొనసాగుతునే ఉంది. తరగతుల్లో వినాల్సిన పాఠాలు.. ఆన్‌లైన్‌ వేదికల్లోనే వింటున్నారు. ఈ ఆన్‌లైన్‌ బోధనను ఇంటర్‌, డిగ్రీలు చదువుతున్న వారే సరిగ్గా అర్థం చేసుకోలేక పోతున్నారు. ఇంకా, ప్రాథమిక విద్యను అభ్యసించే వారి సంగతైతే చెప్పనక్కర్లేదు. అప్పుడప్పుడే ఇంటిని వదిలి.. బడి వాతావరణానికి అలవాటుపడుతున్న వారికి ఈ ఆన్‌లైన్‌ పాఠాలు అసలు అర్థం కావడం లేదు. కొంచెం ఆర్థికంగా మెరుగ్గా ఉన్న కుటుంబాల్లోని చిన్నారులు ఇంత వరకు చదువుకున్న పాఠాలు మర్చిపోతుంటే.. పేదకుటుంబాల్లోని చిన్నారులు బడినే మర్చిపోయి పనుల్ని వెతుకుంటున్న దుస్థితి నెలకొంది. ఈ పరిస్థితి ఏ ఒక్క ప్రాంతానికో కాదు.. దాదాపు అన్ని దేశాల్లోనూ ఇదే తంతు.

7 కోట్ల మంది చదువు అర్థం చేసుకోవట్లేదు..

ఇదేఅంశంపై.. పేదరిక నిర్మూలనకు కృషి చేసే వన్‌ క్యాంపెయిన్‌ సంస్థ అధ్యయనం చేపట్టింది. ఈ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం సాధారణంగానే అతి తక్కువ ఆదాయం కలిగిన దేశాల్లో 10 ఏళ్లలోపు చిన్నారుల్లో 53% మందికి సరిగ్గా చదవడమే రాదు. అలాంటిది.. కరోనా కారణంగా ఈ ప్రభావం 17%పైగా పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా 7 కోట్ల మందికి పైగా పిల్లలు.. తమ స్థాయికి తగ్గట్లు చదువు అర్థం చేసుకోవట్లేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. రాబోయే దశాబ్దకాలంలో ఈ సంఖ్య 70 కోట్లకు చేరుతుందని వన్‌ క్యాంపెయిన్‌ సంస్థ నివేదించింది.

71 బీద దేశాల్లో,..

ఈ పరిస్థితులు ఎక్కువగా ఆఫ్రికా, ఆసియా దేశాల్లో కనిపిస్తాయి. ఈ జాబితాలో ఎక్కువగా ప్రభావితం అవుతోంది.. బాలికలే. కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంటికే పరిమితమైన బాలికల్లో.. 2 కోట్ల మంది తిరిగి బడి బాట పట్టలేదని వన్‌ క్యాంపెయన్‌ అధ్యయనంలో తేలింది. అందులో కొంతమంది పనులకు వెళ్తుండగా.. కొందరు బాల్యవివాహాల బారినపడి వంటింటికే పరిమితమయ్యారు. ప్రపంచవ్యాప్తంగా 71 బీద దేశాల్లో 30%విద్యార్థులకు కనీస ఇంటర్నెట్‌ సదుపాయం లేదు. వివిధ కారణాల వల్ల.. అభివృద్ధి చెందుతున్న భారత్‌ వంటి దేశాల్లోనూ డిజిటల్‌ విద్య అందరికీ అందట్లేదు. ఈ నేపథ్యంలో ఇంటిపనులతో పాటు పొలం పనులు, పశువులు కాస్తూ.. పిల్లలు జీతగాళ్లవుతున్నారని పేర్కొంది.

జీవితాలు అతలాకుతలం..

ఈ మహమ్మారి దెబ్బకు ప్రాథమిక విద్య కొన్నాళ్లు పాటు దూరమైతే ఏదో అనుకోవచ్చు కానీ, కొందరు బాలికలకు శాశ్వతంగా బడి ముఖం చూపించలేని దుస్థితి తీసుకువచ్చింది. లాక్‌డౌన్‌ ఆంక్షలతో పూట గడవటమే ఇబ్బందిగా ఉన్న నిరుపేదల జీవితాలు అతలాకుతలం అయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆడపిల్లలను పెంచి పోషించటం భారంగా భావిస్తూ.. చాలా మంది బాల్య వివాహాలు చేసినట్లు గుర్తించింది వన్‌ క్యాంపెయన్‌. ఎబోలా వ్యాప్తి చెందుతున్న క్రమంలోనూ.. ఆఫ్రికా దేశాల్లో చాలా బాల్యవివాహాలు జరిగి.. ఎందరో విద్యకు దూరమయ్యారని ఈ సంస్థ గుర్తు చేసింది.

ఆకలి పోరాటాలు మరింత ఒత్తిడిలోకి..

చాలా దేశాల్లో పిల్లలకు బడిలో భోజనం అందిస్తుంటారు. ఆర్థికంగా వెనుకబడిన దేశాల్లో పిల్లలకు ఇదే దివ్యౌషధం. ఇక్కడే వారికి పౌష్ఠికారాహాం దొరుకుతుంటుంది. భారత్‌లోనూ .. అనేక మంది చిన్నారులు భోజనం కోసం పాఠశాలకు వెళ్లే సందర్భాలు అనేకం. ఇలాంటి పిల్లల్లో వైరస్ భయంతో పాటు.. ఆకలి పోరాటాలు మరింత ఒత్తిడిలోకి నెడుతున్నాయి. యూనిసెఫ్‌ కూడా ఇదే విషయంపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీంతో గత్యంతరం లేక.. వలస కార్మికులు, రోజువారీ కూలీల పిల్లలు వారితో పాటు పనుల బాట పట్టడం వల్ల అసలు చదువుకే దూరం కావాల్సి పరిస్థితి నెలకొందని పేర్కొంది వన్ క్యాంపెయిన్.

ఇంటికే పరిమితమైన 24 కోట్ల మంది..

భారత్‌ విషయానికొస్తే.. కరోనా వ్యాప్తి నివారించేందుకు దేశవ్యాప్తంగా 15 లక్షలకు పైగా విద్యాసంస్థలు మూతపడటంతో.. ప్రాథమిక విద్య అభ్యసిస్తున్న 24 కోట్ల మంది పిల్లలు ఇంటికే పరిమితమయ్యారు. అంతకు ముందే.. దాదాపు 6 కోట్ల మంది చిన్నారులు పాఠశాలలకు దూరం అయ్యారని యునిసెఫ్‌ నివేదికలో వెల్లడించింది. పేరుకే ఆన్‌లైన్‌ విద్య కొనసాగుతోంది. దేశంలో నలుగురు విద్యార్థుల్లో ఒక్కరే ఈ విధానం ద్వారా చదువు అభ్యసిస్తున్నారు. ఈ పద్దతి ఉపాధ్యాయులకీ కూడా కొత్తే. దీంతో.. సరైన రీతిలో విద్య పిల్లలకు చేరట్లేదు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే.. కరోనా పరిస్థితులు చక్కబడే లోపు.. పిల్లలో అక్షరాస్యత తగ్గిపోయే ప్రమాదం ఉందని యూనిసెఫ్‌ హెచ్చరించింది.

ప్రాథమిక అంశాల్ని మరిచిపోయిన విద్యార్థులు..

కరోనా కారణంగా పిల్లల్లో నేర్చుకునే శక్తి ఏ మేరకు తగ్గిందనే విషయంపై అజీమ్‌ ప్రేమ్‌జీ సంస్థ ఓ అధ్యయనం చేపట్టింది. అందులో భాగంగా.. 5 రాష్ట్రాలకు చెందిన 16వేల మంది విద్యార్థులపై సర్వే చేశారు. ఈ నివేదిక ప్రకారం.. 2020 మార్చిలో పిల్లలు తమకు వచ్చిన వాటిలో.. 82% మంది లెక్కల్లో ప్రాథమిక అంశాల్ని మరిచిపోయారు. 92 శాతం మంది భాషలో ప్రాథమిక అంశాలు మర్చిపోయారు. పై తరగతులకు వెళ్లేందుకు పునాదిగా ఉండే కనీస పరిజ్ఞానం వారి మెదడు నుంచి చెరిగిపోయాయి. చాలా మంది విద్యార్థులు కూడికలు, తీసివేతలు కూడా మర్చిపోయారు. 2,3 తరగతుల్లో చదువుతున్న కొందరికి చదవడం కూడా రావడం లేదని ఈ అధ్యయనంలో తేలింది.

బిత్తరచూపులు చూస్తున్న పిల్లలు..

ఇదే అంశంపై ప్రపంచవ్యాప్తంగా ఇంకా ఎన్నో సంస్థలు అధ్యయనాలు చేపట్టాయి. ఈ అధ్యయనాల ద్వారా 2విషయాలు స్పష్టంగా అర్థమవుతున్నాయి. ఇంటికే పరిమితం కావడం వల్ల.. బతుకు పోరాటంలో విద్యను పక్కన పెట్టి పనికే ప్రాధాన్యమిస్తున్న పిల్లలు కొందరైతే. అప్పటివరకు అర్థం చేసుకున్న చదువు కాస్త మరిచిపోయి.. బిత్తరచూపులు చూస్తున్న పిల్లలు మరికొంత మంది. ఈ నేపథ్యంలో.. కరోనా నియంత్రణ చర్యలు చేపడుతూనే.. ఈ సమస్యకు వెంటనే పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వాలు చొరవ చూపాలని విద్యావేత్తలు అభిప్రాయ పడుతున్నారు.

ఇవీ చూడండి: మీ బాబాయ్ హత్యపై మేం ప్రమాణం చేస్తాం.. మీరు చేస్తారా?: లోకేశ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.