Women's Day 3K runs: మహిళలు విద్యావంతులైతే ఆ కుటుంబంతో పాటు సమాజం కూడా ఎంతో అభివృద్ధి చెందుతుందని కడప ఆర్టీవో శాంతకుమారి అన్నారు. ప్రస్తుతం మహిళలు పురుషులతో పాటు అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్తోందన్నారు. ఓవైపు కుటుంబ భారాన్ని మోస్తూ... మరోవైపు ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగాల్లో మహిళలు రాణిస్తున్నారని తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని... అప్పుడే సమాజం, దేశం మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని చెప్పారు. మహిళా దినోత్సవం సందర్భంగా కడప జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 3కె రన్ ఆమె పాల్గొన్నారు.
అనంతపురంలో....
Women's Day 3K runs: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని అనంతపురం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 3కె రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప, జడ్పీ ఛైర్పర్సన్ గిరిజ ప్రారంభించారు. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినప్పుడే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. మహిళల రక్షణ కోసం దిశ యాప్ ఎంతో దోహదపడుతోందని తెలిపారు. మహిళలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని సూచించారు. జోగిని మహిళల సమస్యలు పరిష్కరించడానికి ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. మహిళా అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రేపు సింగనమల నియోజకవర్గం ఎస్ఆర్ఐటీ కళాశాలలో మహిళా సదస్సు నిర్వహిస్తున్నట్లు జడ్పీ ఛైర్పర్సన్ గిరిజ తెలిపారు.
ప్రకాశం జిల్లాలో...
Women's Day 3K runs: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రకాశం అద్దంకి, ఇంకొల్లులో పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో 3కె. రన్ నిర్వహించారు. భవాని సెంటర్ నుంచి సింగరకొండ వరకు పరుగు సాగింది. విద్యార్థినులు, సచివాలయ మహిళ ఉద్యోగులు, పోలీసులు పాల్గొన్నారు.
విజయనగరంలో...
Women's Day 3K runs: మహిళా దినోత్సవం సందర్భంగా విజయనగరంలో 3కె రన్ నిర్వహించారు. నగరంలోని మయూరి కూడలి నుంచి రైల్వేస్టేషన్, సీఎంఆర్, బాలాజీ మార్కెట్ మీదుగా దిశ పోలీస్టేషన్ వరకు రన్ సాగింది. ఈ పరుగులో మహిళా పోలీసులు, ఎన్సీసీ మహిళా క్యాడెట్స్, విద్యార్థినులు ఉత్సహంగా పాల్గొన్నారు. ఈ పరుగు పందెంలో గెలుపొందిన నలుగురికి ఎస్పీ దీపిక నగదు బహుమతులు అందచేశారు. మహిళల్లో శారీరక దృఢత్వంపై అవగాహన కల్పించేందుకు... పోలీసుశాఖ వారికి అన్ని విధాలుగా అండగా నిలుస్తోందని తెలిపారు.
కృష్ణాజిల్లాలో...
Women's Day 3K runs: కృష్ణాజిల్లా విజయవాడ, జగ్గయ్యపేటలో మహిళ దినోత్సవం సందర్భంగా 3కె రన్‌ను చేపట్టారు. బెంజ్ సర్కిల్ నుంచి ఏఆర్ గ్రౌండ్స్ వరకు రన్‌ను నిర్వహించారు. ఇందులో మహిళా పోలీసులు, హోంగార్డులు పాల్గోన్నారు. మహిళా సిబ్బందికి సంక్షేమం, ఆరోగ్యం కోసం ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తామని విజయవాడ సీపీ కాంతిరాణా అన్నారు. వారికి ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు.
పశ్చిమగోదావరి జిల్లాలో...
Women's Day 3K runs: అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో 3కె రన్ నిర్వహించారు. జెండాఊపి జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ పరుగును ప్రారంభించారు. మహిళా సంరక్షణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను గురించి ప్లకార్డులను ప్రదర్శించారు. మైదానంలో ఉమెన్స్ డే అంటూ చిన్నారులు చేసిన వినూత్నంగా ప్రదర్శన ఆకట్టుకుంది.
ఇదీ చదవండి:
NSTL women scientists: ఎన్ఎస్టీఎల్ మహిళా శాస్త్రవేతలతో ఈటీవీ భారత్ ముఖాముఖి